తల్లి కాబోతున్న బిగ్ బాస్ ముద్దుగుమ్మ

0

బిగ్ బాస్ ఇంటి సభ్యుల నడుమ రొమాన్స్ లవ్వాయణాల గురించి తెలిసిందే. కొన్ని జంటలు ఇంట్లో ఉండగా ప్రేమలో పడి ఆ తర్వాత ఒకటైన సందర్భాలున్నాయి. ఈ కేటగిరీకే చెందుతుంది మలయాళ బిగ్ బాస్ పెయిర్ పర్ల్ మానీ- శ్రీనిష్ అరవింద్ జంట.

ఇంటి సభ్యులుగా ఉన్నప్పుడే ఈ ప్రేమ జంట మ్యాటర్ తెలిసిపోయింది. కట్ చేస్తే… ఇప్పుడు ఏకంగా పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. పర్ల్ మానీ మలయాళ బిగ్ బాస్ రన్నరప్ కాబట్టి తనకు ఉన్న అశేష ఫాలోవర్స్ అంతా ఈ విషయం తెలిశాక శుభాకాంక్షలు తెలిపారు.

“బిగ్ బాస్ ఇంట్లోనే ప్రేమలో పడ్డాం. 2019లో పెళ్లాడుకున్నాం. ఏడాది తిరగకముందే తొలి బిడ్డ. ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనిస్తున్నా“మని తెలిపారు పర్ల్ మానీ. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు మీ దీవెనలు.. ప్రార్థనలు కావాలి!! అంటూ ట్వీట్ చేశారు. ఇటీవల మార్నింగ్ సిక్నెస్ .. వాంతులతో చాలా కష్టంగా ఉంది. మార్చిలో డెలివరీ అని తెలిపారు. అంతేకాదు.. ప్రస్తుతం కోవిడ్ 19 పరిస్థితుల్లో చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నామని వెల్లడించారు. `నీలాకాశం పంచకడల్` చిత్రంతో మలయాళ ఇండస్ట్రీలోకి ప్రవేశించి.. కల్యాణ వైభోగం- టీమ్ 5- కప్పిరి తురుతు చిత్రాల్లో నటించారు. హిందీ చిత్రం లూడో లో ప్రస్తుతం నటిస్తున్నారు.