అప్పుడే వైల్డ్ కార్డ్ ఎంట్రీ చర్చ

0

బిగ్ బాస్ సీజన్ 4 ఆసక్తికరమైన విషయాలతో నిన్న మొదలైన విషయం తెల్సిందే. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ షో లోకి ఎంటర్ అయ్యారు. ప్రతి సీజన్ లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది. ఇద్దరు లేదా ముగ్గరు వైల్డ్ ఎంట్రీస్ ఉండటం చాలా కామన్ గా మనం చూస్తూనే ఉన్నాం. ఈ సీజన్ ప్రారంభం అయ్యి ఒక్క రోజే అయ్యింది. అప్పుడే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు. బిగ్బాస్ సీజన్ 4 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా ఇద్దరు కమెడియన్స్ ను ఎంపిక చేశారని రెండు వారాలు పూర్తి అయిన తర్వాత ఒకేసారి పంపించే యోచనలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ రోజుల్లో సినిమాతో కమెడియన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్ని ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించిన కమెడియన్ శశికుమార్ పంపన మరియు జబర్దస్త్ లో మంచి ఫేమస్ అయిన ముక్కు అవినాష్ ను ఎంపిక చేశారట. ప్రస్తుతం కరోనా టైం కనుక వారిని ఇప్పటికే క్వారెంటైన్ చేశారని సమాచారం అందుతోంది. వారిని క్వారెంటైన్ పూర్తి అయిన తర్వాత షో కు పంపించే అవకాశం ఉంది. వీరిద్దరి ఎంట్రీతో ఖచ్చితంగా మంచి ఎంటర్ టైన్ మెంట్ ఖాయం అనిపిస్తుంది. వీరిద్దరి తర్వాత ఒకటి లేదా రెండు వారాలకు ఒక బ్యూటీని పంపించే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి తెలుగు బిగ్ బాస్ ను ఎప్పుడు లేనంత కొత్తగా విభిన్నంగా ప్లాన్ చేసేందుకు నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ విషయంలో గేమ్ ప్లాన్ ను ప్రదర్శించబోతున్నారట. మొత్తానికి ఈసారి బిగ్ బాస్ యూత్ ఆడియన్స్ ను టార్గెట్ గా చేసి మొదలు పెట్టారు అనిపిస్తోంది.