బిబి4 : పుచ్చ లేపుతానన్న మెహబూబ్..కూల్ గా హారికను బుక్ చేసిన అభిజిత్

0

బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల మరియు లగ్జరీ బడ్జెట్ టాస్క్ బిబి హోటల్ గందరగోళంగా మారింది. హోటల్ సిబ్బంది ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు వ్యవహరిస్తున్నారు. ఇక ధనికులు అయిన వారు సర్వీసులు పొంది టిప్పు ఇవ్వక పోవడం మరియు స్టార్ లు ఇవ్వకుండా ఆడుతున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్ అంటూ సిబ్బంది టీం వారు పదే పదే వారిని అడిగారు. ముఖ్యంగా మెహబూబ్ మరియు సోహెల్ లు టిప్పుగా ఒక్కరూపాయి ఇవ్వకూడదని అనుకున్నట్లున్నారు. దాంతో ఇంటి సభ్యులకు చిర్రెత్తుకు వచ్చింది. ఇదే సమయంలో అవినాష్ మాటలతో మెహబూబ్ రెచ్చి పోయాడు.

ఇద్దరి మద్య మాటలు ముదిరాయి. ఎవడైనా ఎక్కువ మాట్లాడితే పుచ్చ లేసి పోతుందంటూ మెహబూబ్ చాలా సీరియస్ గా అనడంతో అఖిల్ జోక్యం చేసుకుని మాటలు జాగ్రత్తగా రానివ్వు అంటూ హెచ్చరించాడు. అందరిని కలిపి ఏం మాటలు అవి అంటూ సీరియస్ అయ్యాడు. అవినాష్ నీ రౌడీయిజం ఇంటి వద్ద చూపించుకో అంటూ మెహబూబ్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

కొంత సమయం తర్వాత సోహెల్ కూడా అంత మాట అనకూడదురా అనడంతో తన తప్పు తెలుసుకున్న మెహబూబ్ అభిజిత్.. అఖిల్.. అవినాష్ వద్దకు వెళ్లి సారీ చెప్పాడు. ఆ తర్వాత మళ్లీ ఆట కొనసాగింది. ఆటలో భాగంగా తమ టీంకు దక్కాల్సిన స్టార్స్ ను ముందే అభిజిత్ తెలివిగా నొక్కేశాడు. ఇక తనకు ఇచ్చిన సర్వీస్ లు నచ్చడంతో తన వంతుగా ఒక స్టార్ ఇస్తానంటూ హారిక అంది. అయితే అప్పటికే స్టార్స్ అభిజిత్ వద్ద ఉండటంతో మొత్తం స్టార్ లు ఆమె చేతిలో పెట్టాడు. మొత్తం అక్కర్లేదు నాకు ఒకటి చాలు. ఆ ఒక్కటి నేను ఇస్తున్నాను అంటూ నాలుగు మరియు ఒకటి మళ్లీ అభిజిత్ చేతిలో పెట్టింది. దాంతో అభిజిత్ ధనికుల నుండి మా చేతికి అయిదు స్టార్స్ వచ్చాయి. హారిక ఆ జట్టు సభ్యురాలు అవ్వడం వల్ల ఆమె నుండి మాకు స్టార్స్ వచ్చాయంటూ అభిజిత్ ఆమెను బుక్ చేశాడు.

హారిక కెమెరా ముందుకు వచ్చి నేను ఒకే ఒక్క స్టార్ ఇచ్చాను. ఇతర స్టార్స్ విషయం నాకు తెలియదు అంటూ చెప్పింది. అభిజిత్ చీటింగ్ కు హారిక కన్నీరు పెట్టుకుంది. తనను చీటింగ్ చేసి అభిజిత్ నా చేత మొత్తం స్టార్స్ ఇప్పించుకున్నాడు అంటూ హారిక చిన్న పిల్లల కన్నీరు పెట్టుకుంది. ఇక నేటి ఎపిసోడ్ లో గేమ్ కు ఎలాంటి ముగింపు ఉంటుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మైండ్ గేమ్ ఆడిన అభిజిత్ కు బిగ్ బాస్ నుండి ఎలాంటి మాట వస్తుంది. అసలు గేమ్ ఎలా సాగిందనే విషయంపై బిగ్ బాస్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది నేటి ఎపిసోడ్ లో చూడాలి.