అవినాష్.. అరియానా ఓ మెహబూబ్

0

తెలుగు బిగ్ బాస్ ఈ సీజన్ లో జంటలు ఎక్కువ అయ్యాయి. ఒక వైపు అఖిల్.. మోనాల్ మరో వైపు అభిజిత్.. హారిక.. అప్పుడప్పుడు అభిజిత్.. మోనాల్ ల మద్య కెమిస్ట్రీ చూడలేక ప్రేక్షకులు కొన్ని ఎపిసోడ్ లలో అబో ఏంట్రా ఇది అంటూ కామెంట్స్ చేశారు. వీరి మద్యలో అప్పుడప్పుడు అవినాష్ కూడా నేను పులిహోర కలుపుతాను అంటూ జబర్దస్త్ జోకులు వేసుకుంటూ అమ్మాయిలను నవ్వించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో అవినాష్ కలిపిన పులిహోర ఒక మోస్తరుగా పర్వాలేదు అనిపించింది. ఎందుకంటే అతడి కలుపుడికి అరియానా పడిపోతాను అంటూ స్వయంగా చెప్పింది.

పండుగ స్పెషల్ అవ్వడంతో కొత్త బట్టలు వేసుకుని అంతా చాలా అందంగా తయారు అయ్యారు. అరియానా.. అవినాష్ మరియు మెహబూబ్ లు కూర్చుని మాట్లాడుతున్నారు. పక్కన అరియానా ఉండగానే మెహబూబ్ తో అవినాష్ మాట్లాడుతూ అరియానా చాలా బాగుంటుది కదా అనడంతో ఏమో నాకు తెలియదు అంటూ మెహబూబ్ సైడ్ అయ్యే ప్రయత్నం చేశాడు. ఇదే మాట నా ముందు ఇద్దరు ముగ్గురితో చెప్పావు అంటూ అరియానా కౌంటర్ ఇచ్చింది. నువ్వు నా దగ్గర కలిపేందుకు ప్రయత్నించినా నేను పడను నీకు అంటూ చెప్పేసింది.

పడటం ఏంటీ.. అయినా నువ్వు ఎవరు నాకు పడటానికి చల్ అంత లేదు నీకు అంత సీన్ లేదు నాకు కూడా అంటూ నవ్వులు పూయించాడు. అవినాష్ బాగా కుమిలి పోతున్నట్లుగా మాట్లాడటంతో సరే సరేలే పడిపోతాను అంది. మనం ఫ్రెండ్స్ ఈ పడిపోవడం ఏంటీ అంటూ అవినాష్ మళ్లీ రివర్స్ అయ్యాడు. అప్పుడు మెహబూబ్ నువ్వు పింక్ సారీ కట్టుకున్నావని ఆ రోజు పింక్ షర్ట్ వేసుకున్నాడు. అరియానా కోసం వేసుకున్నావా అంటూ మెహబూబ్ అడగడంతో బొక్కేం కాదు నీకోసం నేను ఎందుకు పింక్ వేసుకుంటా అంత అంచనాలు పెట్టుకోకు అంటూ అవినాష్ మళ్లీ జోక్ చేశాడు. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ లో వీరి ముగ్గురి మాటలు నవ్వులు పూయించాయి.