Templates by BIGtheme NET
Home >> Cinema News >> బిబి4 : విజేత కూడా ఓట్ల ప్రకారం కాదా?

బిబి4 : విజేత కూడా ఓట్ల ప్రకారం కాదా?


తెలుగు బిగ్ బాస్ మొదటి మూడు సీజన్ లలో ఒకటి రెండు సార్లు ఓట్ల ప్రకారం ఎలిమినేషన్ జరగడం లేదు అనే విమర్శలు వ్యక్తం అయ్యాయి. కాని సీజన్ 4 లో మాత్రం ఎక్కువ సార్లు ప్రేక్షకుల ఓట్ల అనుసారం కాకుండా బిగ్ బాస్ స్క్రిప్ట్ ప్రకారం ఎలిమినేషన్ చేశారు అంటూ విమర్శలు వచ్చాయి. మోనాల్ ను మరో ఇద్దరిని బిగ్ బాస్ నిర్వాహకులు కాపాడుతూ వచ్చారు. వారు నామినేషన్ లో ఉన్న సమయంలో ఓట్లు పడకున్నా కూడా సేవ్ చేశారు అంటూ టాక్ వచ్చింది. ముఖ్యంగా మోనాల్ విషయంలో అది ఎక్కువగా వినిపించింది. ఎట్టకేలకు బిగ్ బాస్ నుండి మోనాల్ వెళ్లి పోయింది. ఈ వారంతో బిగ్ బాస్ కూడా పూర్తి అవ్వబోతుంది. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరు అంటే ప్రతి ఒక్కరు కూడా అభిజిత్ అంటున్నారు. సోషల్ మీడియాలో అభిజిత్ గురించి ఏ రేంజ్ లో ప్రచారం జరుగుతోంది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

స్టార్ మా వర్గాల నుండి నిన్న మొన్నటి వరకు అందిన వార్తల ప్రకారం వస్తున్న ఓట్లలో 50 శాతంకు పైగా అభిజిత్ కు వస్తున్నాయి. క్లీయర్ కట్ గా అభిజిత్ విన్నర్ అనుకున్నారు. కాని స్టార్ మా వారు కాస్త అతిగా ఆలోచించి.. బిగ్ బాస్ నిర్వాహకులు విమర్శలకు భయపడి ఈసారి అభిజిత్ ను కాకుండా అరియానాను విజేతగా చేసే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అరియానాకు విజేత అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి. కాని అభిజిత్ లేకుంటే ఆమె విజేత అయ్యేది. ప్రేక్షకుల ఓట్లను పక్కన పెట్టి అరియానాను విజేత చేయాలని స్టార్ మా వారు భావిస్తున్నారట. అందుకు ఒకే ఒక్క కారణం ఇప్పటి వరకు మూడు సీజన్ లలో కూడా అమ్మాయి విజేత కాకపోవడం.

వరుసగా నాలుగు సీజన్ ల విజేతలు కూడా అబ్బాయిలే అయితే షో పై నెగిటివిటీ పెరిగే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. అందుకే ఈసారి అమ్మాయిని విజేతగా నిలపాలని టీం భావిస్తుందట. తర్వాత వచ్చే విమర్శల గురించి ఆలోచిస్తే అభిజిత్ ను విజేత గా ప్రకటించకుంటే ఆయన అభిమానుల నుండి ఓ రేంజ్ లో విమర్శలు వస్తాయనే విషయం కూడా స్టార్ మా వారు పరిశీలిస్తున్నారు. రెంటిని బేరీజు వేసుకుని విజేత విషయంలో నిర్ణయం తీసుకుంటారట. ఓట్ల విషయంను పట్టించుకోకుండా అరియానాను స్టార్ మా విజేతగా ప్రకటిస్తే ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరో రెండు రోజుల్లో ఏం జరుగబోతుందో క్లారిటీ రాబోతుంది.