#BB4 లోకి ఎంటర్ అయిన 16 మంది కంటెస్టెంట్స్ వీళ్లే

0

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన తెలుగు బిగ్బాస్ సీజన్ 4 ప్రారంభం అయ్యింది. గత రెండున్నర మూడు నెలలుగా బిగ్ బాస్ గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి. కరోనా కారణంగా అసలు ఈ ఏడాది సీజన్ ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కరోనాను లెక్క చేయకుండా బిగ్ బాస్ షో ను ప్రారంభించేందుకు సిద్దం అయ్యారు. మరోసారి నాగ్ హోస్ట్ గా సీజన్ ప్రారంభించబోతున్నట్లుగా ప్రోమో వచ్చనప్పటి నుండి అంచనాలు పెరిగి పోయాయి.

కంటెస్టెంట్స్ గురించిన ఊహాగాణాలు మొదలయ్యాయి. చాలా మంది పేర్లు ప్రచారం జరిగాయి. అందులో ఎక్కువ శాతం మంది ఫైనల్ జాబితాలో ఉన్నారు. మేము మొదటి నుండి చెబుతు వస్తున్నట్లుగా యూట్యూబ్ సెన్షేషన్ గంగవ్వ కూడా షో లో ఉంది. షోలో ఎంటర్ అయిన మొత్తం కంటెస్టెంట్స్ వీళ్లే..

1. మోనాల్ గజ్జర్ : హీరోయిన్ గా తెలుగులో అయిదు సినిమాల్లో కనిపించింది. ఈమె ఎంట్రీతో షో కు గ్లామర్ రావడంతో పాటు ఎనర్జిటిక్ గా కూడా షో ఉండబోతుంది అనిపిస్తుంది. ఈమె షో మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.

2. సూర్యకిరణ్ : ఈయన ప్రముఖ దర్శకుడు. అక్కినేని హీరో సుమంత్ తో సత్యం సినిమా చేశాడు. ప్రముఖ హీరోయిన్ కళ్యాణి భర్త. ఈయన బిగ్ బాస్ షో లో రెండవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. అతడు ఏ మాదిరిగా ఎంటర్ టైన్ చేస్తాడో చూడాలి.

3. యాంకర్ లాస్య : ఈమె గురించి తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లి తర్వాత టీవీకి దూరం అయ్యి సోషల్ మీడియాలో సందడి చేస్తున్న లాస్య మళ్లీ ఈ బిగ్ బాస్ తో బుల్లి తెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

4. అబిజిత్ : ఇతడు లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాతో పాటు ఒకటి రెండు వెబ్ సిరీస్ ల్లో నటించాడు. ఇతడిపై యూత్ ఆడియన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు ముఖ్యంగా అమ్మాయిలు. మరి ఏం చేస్తాడో చూడాలి.

5. జోర్దార్ సుజాత : హెచ్ ఎం టీవీ లో జోర్దార్ వార్తల ద్వారా ఫేమస్ అయిన తెలంగాణ అమ్మాయి జోర్దార్ సుజాత. తెలంగాణ యాసతో మాట్లాడుతూ అందరిని ఈమె ఎంటర్ టైన్ చేయడం ఖాయం అంటున్నారు.

6. మెహబూబ్ : ఇతడు సోషల్ మీడియా సెన్షేషన్. యూట్యూబ్ తో పాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్న ఇతడు బిగ్ బాస్ లో తనదైన శైలిలో ఎంటర్ టైన్ చేసే అవకాశం ఉంది.

7. టీవీ9 దేవి : తెలుగు వారికి చాలా ఎక్కువగా పరిచయం ఉన్న టీవీ9 యాంకర్ దేవి. ఎప్పుడు బ్రేకింగ్ న్యూస్ లు చెబుతూ ఉండే దేవి తన ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం కోసం బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చింది. మరి షో లో ఎలాంటి బ్రేకింగ్ న్యూస్ చెబుతుందో చూడాలి.

8. దేత్తడి హారిక : యూట్యూబ్ లో దేత్తడి అనే ఛానెల్ ఉంది. దాంతో హారిక చేసే సందడి అంతా ఇంతా కాదు. ఆమె ఎంట్రీతోనే వావ్ అనిపించుకుంది. ఆమె కాస్ట్యూమ్స్ అప్పుడే టాక్ ఆఫ్ ది షో అయ్యింది. ఇమె ఉండటంతో షో అంతా సందడిగా ఉండటం ఖాయం అనిపిస్తుంది.

9. ఇస్మార్ట్ సోహెల్ : ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా సోహెల్ ఉంటున్నాడు. బుల్లి తెరపైనే కాకుండా వెబ్ సిరీస్ ల్లో కూడా కనిపిస్తు వస్తున్న ఈయన ఈసారి బిగ్ బాస్ తో స్టార్ అవ్వాలని ఆశ పడుతున్నాడు.

10. అరియానా గ్లోరీ : జెమిని కామెడీ మరియు ఖుషీ టీవీలో యాంకర్ అయిన ఈ అమ్మాయి తన మాటలతో మాయ చేస్తుంది. ఈమె మాట్లాడే మాటలు అలాగే వినాలపిస్తుంది. అందుకే ఈమె షో లో అల్లరి మస్త్ చేయడం ఖాయం అనిపిస్తుంది.

11. అమ్మ రాజశేఖర్ : ప్రముఖ దర్శకుడు.. నృత్య దర్శకుడు అయిన అమ్మ రాజశేఖర్ తన డాన్స్ లతో షో ను మస్త్ ఎంటర్ టైన్ చేయడం ఖాయంగా ప్రేక్షకులు ఆశలు పెట్టుకున్నారు.

12. కరాటే కళ్యాణి : కృష్ణ సినిమాలో బ్రహ్మానందంతో బాబీ అంటూ ఒక్క సీన్ లో నటించి ఇన్నాళ్లు కెరీర్ ను నెట్టుకు వస్తున్న ఈమె ఈ షోలో కొత్తగా కనిపిస్తానంటూ చెప్పి అడుగు పెట్టింది. మరి ఏం చేస్తుందో చూడాలి.

13. సింగర్ నోయల్ : ప్రతి సీజన్ లో సింగర్ ఉంటున్నారు. ఈసారి ఇతడికి ఛాన్స్ దక్కింది. మల్టీ ట్యాలెంటెడ్ అయిన నోయల్ షో ను రాక్ చేస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

14. దివి : ఈమె మోడల్.. నటి ఈమద్య కాలంలో గుర్తింపు దక్కించుకుంటుంది.

15. అఖిల్ సర్తక్ : హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా నిలిచిన ఇతడు షో లో రచ్చ చేస్తాడేమో చూద్దాం.

16. గంగవ్వ : మై విలేజ్ షో అనే ఒక యూట్యూబ్ ఛానెల్ లో కనిపించే గంగవ్వకు జాతీయ మీడియా కవరేజ్ కూడా దక్కింది. ఈ షో లోని కంటెస్టెంట్స్ మొత్తానికి ఎంత మంది మద్దతు దారులు ఉంటారో కేవలం ఒక్క గంగవ్వకు అంతకు మించి మద్దతుదారులు ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసారి గంగవ్వ కోసం బిగ్ బాస్ చూస్తాం అంటున్నారు. ఆమె వయసు రీత్యా టాస్క్ లు చేయడం కష్టమే అయినా ఆమె ఇంటికి ఒక పత్యేక ఆకర్షణగా ఉంటుందని అనిపిస్తుంది. అయితే గంగవ్వ అక్కడి వారితో ఎలా ఉంటుంది.. తన ఊరును వదిలి ఉండగలుగుతుందా అనేది మాత్రం చూడాలి.

మొత్తానికి కంటెస్టెంట్స్ పరిచయం అయ్యింది. ఇక అసలు ఆట నేటి నుండి మొదలు అవ్వబోతుంది. ఏం జరుగుతుందో లెట్స్ వాచ్ బిగ్ బాస్. ప్రతి రోజు ఎపిసోడ్ కు సంబంధించిన విశేషాలను తెలుసుకునేందుకు స్టే ట్యూన్ తుపాకి.