బ్లూ ఐస్ ట్రైలర్ టాక్

0

డిజిటల్ వరల్డ్ లో ఓటీటీల హవా నడుస్తుండటంతో అందరూ దానికి తగ్గట్టే వెబ్ కంటెంట్ ని డెవలప్ చేస్తున్నారు. ఇంతకు ముందు అస్లీల కంటెంట్ కి అభ్యంతకర చిత్రాలకు సెన్సార్ బోర్డ్ అడ్డుకట్ట వేసేది. దీంతో ‘ఏ’ సర్టిఫికేట్ సినిమా అయినా సరే ఒక పరిధి మేరకే కంటెంట్ చూపించేవారు. అయితే ఇప్పుడు ఓటీటీ కంటెంట్ కి సెన్సార్ లేకపోవడంతో రెచ్చిపోయి బోల్డ్ కంటెంట్ చూపించేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ”బ్లూ ఐస్” అనే రొమాంటిక్ థ్రిల్లర్ మూవీని ఓటీటీ రిలీజ్ కి రెడీ చేసారు. ఆఫ్రీన్ సిద్ధు – నాస్టియా రాయ్ – నిశాంత్ వాలియా – ఆర్జే పృథ్వీ నటించిన ఈ చిత్ర ట్రైలర్ నేడు రిలీజ్ చేసారు.

కాగా ఓటీటీ కోసమే రెడీ చేసిన ‘బ్లూ ఐస్’ చిత్ర ట్రైలర్ ఆధ్యంతం అభ్యంతకర సన్నివేశాలతో నింపేశారు. రెండు నిమిషాల నిడివిలో కంటెంట్ తో సంబంధం లేకుండా కిస్సింగ్ సీన్స్ తో పాటు శృంగార దృశ్యాలను కూడా చూపించేసారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కంటే బోల్డ్ సీన్స్ కే ప్రాధాన్యత ఇచ్చినట్లు ట్రైలర్ చూస్తూనే అర్థం అవుతోంది. ఇక బికినీలతో పాటు బెడ్ రూం సీన్స్ ని కూడా చూపించిన ఈ చిత్రంపై ఓ వర్గం ఆడియన్స్ కి ఆసక్తిని కలిగించేలా ఉంది. ఈ చిత్రాన్ని రాధా మాదవి – రవళి చౌదరి సమర్పణలో మాదల రామకృష్ణ నిర్మించారు. రాజేష్ మూర్తి దర్శకత్వం వహించగా ఎమ్.అనిరుధ్ సంగీతం అందించాడు. ‘బ్లూ ఐస్’ చిత్రాన్ని శ్రేయాస్ ఈటీ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో త్వరలోనే విడుదల చేయబోతున్నారు.