సమీర్ కి జంట దొరికాడు

0

శతమానంభవతి వంటి సూపర్ హిట్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించి మెప్పించిన సతీష్ వేగేశ్న తన తనయుడు సమీర్ ను హీరోగా పరిచయం చేయబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని ఆయన స్వయంగా వెళ్లడి చేశాడు. అయితే సమీర్ ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమాలో మరో హీరో కూడా ఉంటాడని మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. ఆ హీరో ఎవరు అనే విషయంలో పలు రకాల పుకార్లు షికార్లు చేశాయి. ఇటీవల నటుడు సత్యదేవ్ ను సతీష్ వేగేశ్న సంప్రదించాడంటూ కూడా వార్తలు వచ్చాయి.

సమీర్ హీరోగా పరిచయం కాబోతున్న ఈ చిత్రంలో మరో హీరోగా సత్యదేవ్ కాకుండా రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంష్ హీరోగా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇతడు రాజ్ దూత్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా నిరాశ పర్చడంతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ సతీష్ వేగేశ్న చిత్రంలో సమీర్ తో కలిసి ఇతడు నటించే అవకాశం ఉందంటున్నారు. అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. సమీర్ మరియు మేఘాంష్ లకు ఈ సినిమా సక్సెస్ ను తెచ్చి పెడుతుందేమో చూడాలి.