Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఓటీటీలను ఊపేస్తున్న బోల్డ్ వెబ్ సిరీస్ లు

ఓటీటీలను ఊపేస్తున్న బోల్డ్ వెబ్ సిరీస్ లు


ప్రస్తుతం ఓటీటీలదే హవా! టాప్ మోస్ట్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లు అయిన అమెజాన్ ప్రైమ్ నెట్ ప్లిక్స్.. జీ-5 లాంటి దిగ్గజ సంస్థల్లో ప్రసారమవుతోన్న వెబ్ సిరీస్ ల ట్రెండ్ గురించి చెప్పాల్పిన పనిలేదు. ఇటీవల సినిమాల కంటే వెబ్ సిరీస్ లకే ఎక్కువ గిరాకీ కనిపిస్తోందంటే అర్థం చేసుకోవచ్చు. క్రైమ్.. రొమాన్స్ .. సస్పెన్ప్ థ్రిల్లర్..వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్ లకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం ఓ ఐదు బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన సిరీస్ లు ఓటీటీల్నీ ఊపేస్తున్నాయి.

`గాంధీ బాత్` అనే వెబ్ సిరీస్ ఇప్పటికే 5 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. పల్లెటూళ్లు.. పట్టణాలు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ఘాటైన శృంగార కార్యకలాపాలే గంధీబాత్ టార్గెట్. అలాగే `ఫసీ పాంటసీ` అనే సిరీస్ వూట్ అనే ఓటీటీ ని ఊపేస్తోంది. ఇప్పటివరకూ తొమ్మిది ఎపిసోడ్లు లైవ్ అయ్యాయి. అన్నింటికి యువత నుంచి చక్కని ఆదరణ లభించింది. స్వరా భాస్కర్ నటిస్తోన్న `రస్ భరీ` బోల్డ్ కంటెంట్ తో అలరిస్తోంది. లేడీ టీచర్- స్టూడెంట్ప్ మధ్య రొమాంటిక్ యాంగిల్ ని అద్భుతంగా చూపించారు. దీంతో ఈ సిరీస్ బాగా పాపులర్ అయింది.

అలాగే నెట్ ప్లిక్స్ లో లైవ్ అవుతోన్న `హలో మనీ` అనే నాటీ సిరీస్ కు మంచి క్రేజ్ ఉంది. కంటెంట్ తో పాటు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోనూ ఈ సిరీస్ సాగిపోతోంది. ప్రతి రొమాంటిక్ సన్నివేశం ఆద్యంత ఆసక్తికరంగా సాగుతున్నే. ఇక అమెజాన్ ప్రైమ్ లో లైవ్ అవుతోన్న `ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్` చక్కని సందేశాత్మక సిరీస్ గా నిలిచింది. నలుగురు భారతీయ మహిళలు తమదైన శైలిలో జీవితాన్ని ఆస్వాధిస్తారు. ఆ లైఫ్ నే కాస్త బోల్డ్ గా మలిచి సక్సెస్ అయ్యారు.

ఇక జీ-5 లో లైవ్ అవుతున్న `వర్జిన్ భాస్కర్` బాగా పాపులరైంది. టైటిల్ లోనే కథ ఎంత బోల్డ్ గా ఉంటుందన్నది అర్ధమవుతోంది. రొమాంటిక్ రైటర్ గా పేరు గాంచిన భాస్కర్ రియల్ లైఫ్ లో వెనుకబాటు తనం గురించి ఈ సిరీస్ లో చక్కగా వివరించారు. ఇంకా పలు బోల్డ్ కంటెంట్లకు యువత నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.