పోతురాజు గారి `బొమ్మ బ్లాక్ బస్టర్` అంటగా..

0

నవతరం హీరోల్లో నందు గురించి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ టాప్ సింగర్ గీతామాధురిని ప్రేమించి పెళ్లాడిన కుర్రాడిగా అతడికి ప్రత్యేకించి ఫాలోయింగ్ ఉంది. నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ సవాళ్లను స్వీకరిస్తూ నందు వెళుతున్న దారి గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇటీవల అతడు ప్రయోగాత్మక కథల్ని ఎంచుకుని కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఫ్యాన్ బేస్ ని పెంచుకోవాలన్న పంతంతో ఉన్నాడు. మరోవైపు బుల్లితెరపై స్టార్ స్పోర్ట్స్ హోస్ట్ గానూ నందు రాణిస్తున్నాడు.

`సవారి` అంటూ ఇటీవల ఆసక్తికర కాన్సెప్టునే ట్రై చేశాడు. బాద్ షా అనే గుర్రానికి కేర్ టేకర్ గా ఉండే సాధాసీధా రాజు గా .. రిచ్ గాళ్ ని ప్రేమించే కుర్రాడిగా కనిపించాడు. ప్రస్తుతం మరో ఆసక్తికర టైటిల్ తో కొత్త ప్రయత్నం మొదలెట్టాడు. సినిమా టైటిల్ `బొమ్మ బ్లాక్ బస్టర్`. తాజాగా కొత్త లుక్ రిలీజైంది. ఇందులో అతడి గెటప్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. జమీందార్ లా ఒళ్లంతా బంగారు ఆభరణాలు ఖరీదైన కాస్ట్యూమ్ తో కనిపిస్తున్నాడు. నుదుటిన నెలవంక.. చెవి లోలాకు.. నోట్లో ఆ సిగరెట్ చూస్తుంటే ఏదైనా డ్రామా కంపెనీ ఆర్టిస్టు లేదా సినీఆర్టిస్టునే తెరపై కనిపిస్తున్నాడని అర్థమవుతోంది. పైగా అతడి పేరు పోతురాజు అంటూ బర్త్ డే పోస్టర్ లో రివీల్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ లో ఆటోల సెటప్ ఏంటో ఆసక్తికరంగానే ఉంది.

అయితే అన్నిటికీ తెరదించుతూ చిత్రబృందం అధికారిక వివరాల్ని వెల్లడించనుందని తెలుస్తోంది. మా పోతురాజు `నందు విజయ్ కృష్ణ`కు బర్త్ డే శుభాకాంక్షలు అంటూ చిత్రబృందం విషెస్ తెలిపింది. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై రాజ్ విరాట్ దర్శకత్వంలో ప్రవీన్ పగడాల- బోసుబాబు- ఆనంద్ రెడ్డి- మనోహర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. టైటిల్ బ్లాక్ బస్టరే.. బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్.