అతిలోక సుందరి కూతుళ్ల మనస్తత్వానికి ప్రతీకగా..!

0

అతిలోక సుందరి శ్రీదేవి ఆకస్మిక మరణం అనంతరం జాన్వీ.. ఖుషీ కపూర్ విషయంలో పాపా(డాడీ) బోనీకపూర్ ప్రతి సందర్భంలోనూ ఎంతో ఎమోషనల్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరినీ కంటికి రెప్పలా కాచుకుంటున్నాడు. ఇక అన్నగారు అర్జున్ కపూర్ అయితే చెల్లెళ్లపై ఈగను కూడా వాలనివ్వడం లేదు. చెల్లెళ్లను ఎంతో మురిపెంగా లాలనగా చూసుకుంటూ శభాష్ అనిపిస్తున్నాడు.

అదంతా సరే కానీ.. ఈ లాక్ డౌన్ లో బోనీ ఫ్యామిలీ ఎఫైర్స్ గురించి తెలుసుకోవాలనుంటే ఇదిగో జాన్వీ కపూర్ గురించి డీప్ గా తెలుసుకోవాలి. జాన్వి – ఖుషి కపూర్ సిస్టర్స్ లాక్ డౌన్ అంతటా తమ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని తాజాగా రివీలైన ఫోటోలు చెబుతున్నాయి. కపూర్ గాళ్స్ ఇద్దరూ ఈ ఖాళీ సమయంలో పెయింటింగ్ ద్వారా వారి సృజనాత్మకతను పెంచుకున్నారు.

ఈ విషయాన్ని నిర్మాత బోనీ కపూర్ స్వయంగా ట్విట్టర్ లో రివీల్ చేశారు. జాన్వి – ఖుషీ గీసిన కొన్ని చిత్రాలను ట్వీట్ చేసి `గర్వంగా..` అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ పెయింటింగ్స్ చూస్తుంటే ఇందులో ఖచ్చితంగా మగువల మనసులో ఏదో కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే తల్లిని కోల్పోయిన కూతుళ్ల ఆవేదనా పూరితమైన మనస్తత్వం ప్రతిబింబిస్తోంది. ఆధ్యాత్మిక చింతనతో ఊరట చెందుతున్న సంగతి అర్థం స్ఫురిస్తోంది. జాన్వి చివరిసారిగా నెట్ ఫ్లిక్స్ చిత్రం `గుంజన్ సక్సేనా – ది కార్గిల్ గర్ల్` లో కనిపించారు. తదుపరి `రూహి అఫ్జానా`.. `దోస్తానా 2` చిత్రాల్లో కనిపించనున్నారు.