‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ ఫస్ట్ లుక్…!

0

‘కేరింత’ ‘మనమంతా’ ‘ఓ పిట్టకథ’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘BFH’ (బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్). ఈ చిత్రంలో మాళవిక సతీషన్ హీరోయిన్ గా నటిస్తోంది. పూజా రామచంద్రన్ – మధునందన్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంతోష్ కుంభంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. స్వస్తిక సినిమా మరియు ప్రైమ్ షో ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్లపై వేణు మాధవ్ పెద్ది – నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉన్న ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరోయిన్ మాళవిక హీరో విశ్వంత్ ని తన భుజాలపై మోసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. అందులో ఇద్దరూ చాలా ఆనందంగా కనిపిస్తాయి. ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటంతో పాటు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కి సరైన కాన్సెప్ట్ అని అర్థం అవుతోంది. ఇక ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. త్వరలోనే సాంగ్స్ విడుదల కానున్నాయి. బాలా సరస్వతి సినిమాటోగ్రఫీ అందించగా విజయ్ వర్ధన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రాజా రవీంద్ర – హర్షవర్ధన్ – శివ నారాయణ – రూపాలక్ష్మి – నెల్లూరు సుదర్శన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.