మెగా ప్రిన్సెస్ కి టాలీవుడ్ ముద్దుగుమ్మల స్పెషల్ పార్టీ…!

0

మెగా డాటర్ నిహారిక కొణిదెల వివాహం త్వరలో జరగనుందనే విషయం తెలిసిందే. గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక పెళ్లి నిశ్చయమైంది. ఇటీవలే నిహారిక – చైతన్యల నిశ్చితార్థం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. డిసెంబర్ లో మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. వరుణ్ తేజ్ ప్రస్తుతం డెస్టినేషన్ వెడ్డింగ్ కి సంబంధించిన ఏర్పాట్లను చూసుకుంటున్నారు. పెళ్లి నేపథ్యంలో ఇటీవలే నిహారిక తన స్నేహితులతో కలిసి గోవాలో బ్యాచిలరేట్ పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీకి సంబంధించిన ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజాగా టాలీవుడ్ హీరోయిన్లు లావణ్య త్రిపాఠి – రీతూ వర్మలు కలిసి కాబోయే వధువు నిహారికకు స్పెషల్ పార్టీ ఇచ్చారు. ఈ విషయాన్ని నిహారిక తన సోషల్ మీడియా మాధ్యమాలలో వెల్లడించిన నిహారిక ‘నేను అస్సలు ఊహించలేదు. చాలా బావుంది. లవ్ యు లావణ్య – రీతూ – అనితా రెడ్డి’ అని పోస్ట్ పెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా పంచుకుంది. ఈ ఫోటోలలో లావణ్య – రీతూ లతో కలిసి మెగా ప్రిన్సెస్ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. లావణ్య త్రిపాఠి కూడా ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.