బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్.. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్..!

0

ఇటీవల కాలంలో కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకులు పెద్ద సినిమానా చిన్న సినిమానా అని చూడకుండా మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా అయితే చాలు హిట్ చేసేస్తున్నారు. అందుకే గతంతో పోల్చితే ఇప్పడు చిన్న సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా విభిన్నమైన కాన్సెప్ట్ లతో రూపొందిన సినిమాలకు మరింతగా డిమాండ్ ఉంది.

ఇలాంటి సమయంలో రాబోతున్న డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ “బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్” (BFH). విశ్వంత్ దుద్దుంపూడి మరియు మాళవిక సతీషన్ జంటగా సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అద్దెకు బాయ్ ఫ్రెండ్ అనే క్రేజీ ఐడియాతో రూపొందిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 14న థియేటర్లలోకి రాబోతుంది.

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు యూత్ ఆడియన్స్ నుంచి విశేష స్పందన లభించింది. టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. విభిన్నమైన నేపథ్యంలో.. యూత్ కి కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ అవ్వడం వల్ల మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన చిత్ర యూనిట్.. పెద్దగా పోటీ లేని అక్టోబర్ 14వ తారీఖున ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇది తప్పకుండా ప్రేక్షకుల కనెక్ట్ అవుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. మరి యూత్ ని టార్గెట్ చేస్తూ వస్తోన్న ‘BFH’ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.

“బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్” చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటెర్టైన్మెంట్స్ మరియు స్వస్తిక సినిమా బ్యానర్స్ పై నిరంజన్ రెడ్డి – వేణు మాధవ్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. గోపీ సుందర్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు.