ఆ హీరో సినిమాతో భారీ నష్టాలు

0

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా వరుసగా సినిమాలు చేస్తున్న సినిమా ప్రొడక్షన్ కంపెనీలలో సీతారా ఎంటర్టైన్మెంట్స్ కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ ప్రొడక్షన్లో వస్తున్న సినిమాలకు ఈ మధ్య మంచి రిజల్ట్ అయితే అందుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రముఖ నిర్మాత రాధాకృష్ణ (చినబాబు) హారిక హాసిని ప్రొడక్షన్ కు ఇది అనుబంధ సంస్థ అని అందరికీ తెలిసిన విషయమే.

ఇక వారి వారసుడు నాగ వంశీ సీతారా ఎంటర్టైన్మెంట్స్ ను విజయవంతంగా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ అలాగే గీత ఆర్ట్స్ మరికొన్ని బిజీగా ఉండే ప్రొడక్షన్ హౌస్ ల కంటే కూడా సీతార ఎంటర్టైన్మెంట్స్ లో ఎక్కువ సినిమాలు రూపొందుతున్నాయి. ఇక ఈ బ్యానర్ లోనే 5వ తేదీన స్వాతిముత్యం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ క్రమంలో చిత్ర నిర్మాత నాగవంశి గతంలో ఎదురైనా ఒక చేదు అనుభవాన్ని ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఒక యువ హీరో సినిమా కారణంగా చాలా వరకు డబ్బులు నష్టపోవాల్సి వచ్చింది అని తెలియజేశాడు. అతను మరెవరో కాదు శర్వానంద్ అంటూ అతనితో చేసిన సినిమా ఒకటి తీవ్రంగా నిరాశపరిచిందని అన్నారు. రణరంగం అనే ఆ సినిమా కథ విన్నప్పుడు ఒక ప్రయోగం చేయబోతున్నట్లు మాకు అర్థమయింది.

బాబాయ్ కూడా అసలు అలాంటి సినిమా చేయవద్దు అని రిస్క్ అవసరమా అని కూడా అన్నారు. కానీ డిఫరెంట్ గా ఉంటుంది అని వర్కవుట్ అవుతుందేమో అని ప్రయత్నం చేశాను. కానీ రిజల్ట్ మా బాబాయి ఊహించినట్లే వచ్చింది. ఇక తర్వాత మళ్లీ ఇలాంటి ప్రయోగాలు చేయకూడదని ఫిక్స్ అయ్యాం.

ఆయన వద్దు అంటే మాత్రం తప్పకుండా అలాంటి ప్రాజెక్టుల జోలికి వెళ్లడం లేదు.. అని నాకు వంశీ వివరణ ఇచ్చాడు. ఇక స్వాతిముత్యం సినిమాకు తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని నమ్మకంతో ఉన్నాము అంటూ ఈ సినిమా పాజిటివ్ టాక్ తోనే మంచి కలెక్షన్స్ అందుకుంటుందని నాగ వంశీ ధీమా వ్యక్తం చేశారు.