Templates by BIGtheme NET
Home >> Cinema News >> స్టార్ హీరోలంతా దానికే ఎడిక్ట్ అయిపోతున్నారు

స్టార్ హీరోలంతా దానికే ఎడిక్ట్ అయిపోతున్నారు


కొత్తగా ట్రెండ్ మొదలైతే దాన్ని ఫాలో కావడం ఇప్పడు ప్రతీ ఒక్కరికీ అలవాటుగా మారింది. మన టాలీవుడ్ హీరోలు కూడా కొత్త ఫార్ములాకు ఎడిక్ట్ అవుతున్నారు. అదే పంథాలో సినిమాలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన పీరియాడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ `కేజీఎఫ్` కేజీఎఫ్ 2 ఈ సిరీస్ సినిమాలు డార్క్ థీమ్ తో గనుల నేపథ్యంలో రూపొందినవే. ఫస్ట్ పార్ట్ ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా విడుదలై ఊహకందని రీతిలో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇందులో హీరో యష్ గని కార్మికుడిగా రగ్గ్డ్ క్యారెక్టర్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఆ తరువాత వచ్చిన పార్ట్ 2 కూడా బంగారు గనుల నేపథ్యంలో సాగేదే కావడం కథ కథనాలు హీరో క్యారెక్టర్ ఆసక్తికరంగా వుండటంతో ఈ సినిమాకు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్లుగా నిలవడంతో ఇప్పడు డార్క్ థీమ్ టాలీవుడ్ లో ట్రెండ్ గా మారి హీరోలకు సరికొత్త ఫార్ముల అయింది.

ఇప్పుడు స్టార్ హీరోలంతా ఇదే డార్క్ థీమ్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు. డార్క్ థీమ్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేస్తున్నారు. క్యారెక్టర్ కూడా థీమ్ కు తగ్గట్టే రగ్గ్డ్ గా డీ గ్లామర్ గా వుండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అలాంటి కథలకే అథిక ప్రాధాన్యత ఇస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తొలిసారి `పుష్ప`లో బ్లాక్ థీమ్ తో సాగే క్యారెక్టర్ లో ఊర మాస్ గా కనిపించి పాన్ ఇండియా హిట్ ని దక్కించుకున్న విషయం తెలిసిందే.

బ్లాక్ థీమ్ మేకప్ తో `పుష్ప 2`లోనూ బన్నీ కనిపించబోతున్నాడు. ఇటీవలే మరో సారి లుక్ టెస్ట్ ని కూడా దర్శకుడు సుకుమార్ నిర్వహించారు కూడా. అక్టోబర్ 10 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. అనంతరం ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తారట. ఇక ఇదే పంథాని అనుసరిస్తూ నేచురల్ స్టార్ నాని `దసరా` సినిమాలో నటించిన విషయం తెలిసిందే. తెలంగాణ లోని బొగ్గుగనుల నేపథ్యంలో సాగే సినిమా ఇది.

ఇందు కోసం బ్లాక్ కలర్ థీమ్ తో మేకప్ వేసుకుని నాని గని కార్మికుడిగా మాసీవ్ అవతార్ లో కనిపించబోతున్నాడు. ఇటీవల విడుదల చేసిన నాని లుక్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. బ్లాక్ కలర్ థీమ్ లో బొగ్గుగని కార్మికుడిగా పక్కా లోకల్ యువకుడిగా నాని కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటూ సినిమాపై హైప్ ని క్రియేట్ చేస్తోంది. సోమవారం సాయంత్రం ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ గా `ధూమ్ ధామ్ దోస్తాన్` అనే లిరికల్ వీడియోని విడుదల చేస్తున్నారు.

ఇక `సలార్`లోనూ ప్రభాస్ ఇదే తరహా డార్క్ థీమ్ తో కనిపించబోతున్నాడు. ఇది కూడా బొగ్గు గనుల నేపథ్యంలోనే సాగనుందని తెలుస్తోంది. తెలంగాణలో వున్న పలు బొగ్గు గనుల్లో కీలక ఘట్టాలకు సంబంధించిన షూటింగ్ ని చిత్ర బృందం పూర్తి చేసింది. త్వరలో కీలక షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. మాస్ మహారాజా రవితేజ కూడా తను నటిస్తున్న పీరియాడ్ డ్రామా `టైగర్ నాగేశ్వరరావు` కోసం ఇదే డార్క్ థీమ్ ని ఎంచుకున్నాడట. సినిమాతో తన పాత్ర మాసీవ్ గా కనిపించబోతోందని ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్ తో క్లారిటీ వచ్చేసింది.

ఇక ఇదే థీమ్ ని అఖిల్ నటిస్తున్న `ఏజెంట్` క్లైమాక్స్ కోసం ఫాలో అవుతున్నారట. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలోని కీలక అతిథి పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. బళ్లారి సమీపంలో వున్న గనుల్లో ఈ మూవీ క్లైమాక్స్ కి సంబంధించిన కీలక ఘట్టాలని చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారట. వీరి తరహాలోనే మరి కొంత మంది హీరోలు కూడా డార్క్ థీమ్ పై మనసు పడుతుండటంతో ఇప్పుడు టాలీవుడ్ లో డార్క్ థీమ్ క్రేజీ ఫార్ములాగా మారిపోయింది.