Templates by BIGtheme NET
Home >> Cinema News >> బబుల్ గమ్ టీజర్ టాక్.. సుమ వారసుడి రొమాంటిక్ స్టార్ట్

బబుల్ గమ్ టీజర్ టాక్.. సుమ వారసుడి రొమాంటిక్ స్టార్ట్


రాజీవ్ కనకాల, యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తోన్న మూవీ బబుల్ గమ్. క్షణం ఫేం రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా సిద్ధం అవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ నడుస్తోంది.

హైదరాబాద్ స్లమ్ లో చికెన్ షాపు నడుపుకునే వ్యక్తి కొడుకుగా, పబ్ లో జాకీగా లో క్లాస్ ఆటిట్యూడ్ తో ఉండే అబ్బాయి. కాస్ట్లీ లైఫ్ స్టైల్ లో హైఫై గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తోన్న అమ్మాయి మధ్యలో లవ్ స్టొరీగా ఈ చిత్రాన్ని దర్శకుడు రవికాంత్ ఆవిష్కరించారు. యూత్ ఫుల్ కామెడీతో ఇంటరెస్టింగ్ డైలాగ్స్ తో బబుల్ గమ్ గురించి డైలాగ్ వాయిస్ ఓవర్ లో నేరేట్ చేస్తూ టీజర్ స్టార్ట్ చేశారు.

తరువాత పబ్ లో జాకీగా చేస్తోన్న హీరో, హీరోయిన్ ప్రేమలో పడటం అక్కడి నుంచి వారి రొమాంటిక్ జర్నీని చూపించారు. మధ్యలో కాస్తా ఎమోషనల్ బ్రేక్ అప్ ని బిల్డ్ చేసి చివర్లో రొమాంటిక్ ఎండ్ తో టీజర్ ముగించారు. హీరో పాతబస్తీలో పెరిగే కుర్రాడిగా పక్కా హైదరాబాదీ స్టైల్ లో చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

బయగాన్ లో ప్యార్ బబుల్ గమ్ లాంటిది స్టార్టింగ్ లో తీయ్యగుంటది. తరువాత అంటుకుంటది.షూస్ క్రింద, థియేటర్స్ లో సీట్స్ క్రింద అంత ఈజీ కాదు.పండబెట్టేస్తది అంటూ వచ్చే ఇంట్రో డైలాగ్ మూవీ కంటెంట్ ఏంటి అనేది చెప్పకనే చెబుతోంది. దానికి తగ్గట్లుగానే టీజర్ ని కట్ చేశారు. ఈ చిత్రంతో మానసా చౌదరి హీరోయిన్ గా పరిచయం అవుతోంది.

రొమాంటిక్ సన్నివేశాలలో కూడా ఈ బ్యూటీ భాగానే నటించేసింది. రోహన్ కనకాల కూడా క్యారెక్టర్ ని పెర్ఫెక్ట్ లైన్ లో తన పెర్ఫార్మెన్స్ తో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ కూడా కాస్తా ట్రెండీలో యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉందని చెప్పొచ్చు.