పుట్టిన రోజున అరుదైన గౌరవం దక్కించుకున్న షారుఖ్

0

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నిన్న తన 55వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్బంగా ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే సమయంలో ఆయనకు సినీ ప్రముఖులు రాజకీయ మరియు వ్యాపార ప్రముఖులు కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అన్నింటి కంటే ప్రత్యేకమైన విషెష్ ను షారుఖ్ నిన్న దక్కించుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బూర్జ్ ఖలీఫా షారుఖ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ లేజర్ షో కు నెలవు అయ్యింది.

ప్రపంచంలోని అత్యంత ప్రభావితమైన వ్యక్తులు మరియు ముఖ్య సంఘటనలు మాత్రమే దుబాయి బూర్జ్ ఖలీఫాపై లేజర్ షో వేస్తారు. అలాంటిది షారుఖ్ ఖాన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ బూర్జ్ ఖలీఫాపై ప్రదర్శించడం చర్చనీయాంశం అయ్యింది. ఇది నిజంగా షారుఖ్ కు ఈ పుట్టిన రోజుకు అరుదైన బహుమానంగా చెప్పుకోవచ్చు. హీరోగా ఈమద్య కాలంలో నిరాశ పర్చుతూ వస్తున్నా కూడా షారుఖ్ కు ఉన్న అభిమానుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. రెండు దశాబ్దాలుగా బాలీవుడ్ లో టాప్ స్టార్ గా కొనసాగుతూ వస్తున్న షారుఖ్ ఖాన్ కు బూర్జ్ ఖలీఫా అరుదైన గౌరవంను కట్టబెట్టింది.

Thanks & love u #BurjKhalifa