సినిమా ప్రొడక్షన్ లోకి దిగిన ఫోర్బ్స్ లిస్టెడ్ బిజినెస్ మ్యాన్..!

0

ఇటీవల కాలంలో చాలా కార్పొరేట్ కంపెనీస్ సినిమా నిర్మాణంలోకి దిగాయి. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను తీస్తూ సినీ ఇండస్ట్రీలో కూడా సత్తా చాటాలని చాలామంది వ్యాపారవేత్తలు ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో బిజినెస్ మ్యాన్ కొవ్వూరి సురేష్ రెడ్డి కూడా మూవీ ప్రొడక్షన్ లోకి దిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కు చెందిన యానిమేషన్ వీఎఫ్ఎక్స్ సంస్థ క్రియేటివ్ మెంటర్స్ అధినేత కొవ్వూరి సురేశ్ రెడ్డి. ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక తెలుగు వ్యక్తి. ఫోర్బ్స్ ప్రచురించిన 30ఏళ్ల లోపున్న 30 మంది ప్రతిభావంతుల జాబితాలో ఆయన ఒకరిగా నిలిచారు. అతి చిన్న వయసులో ఫోర్బ్స్ లిస్టులో చోటు దక్కించుకున్న సురేశ్ రెడ్డి.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కూడా సక్సెస్ సాధించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.

కొవ్వూరి సురేష్ రెడ్డి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున సినిమాలు నిర్మించనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం మూడు చిత్రాలను తన ప్రొడక్షన్ హౌస్ లో నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. సత్యదేవ్ తో ’47 డేస్’ సినిమా తీసిన పూరి జగన్నాథ్ శిష్యుడు ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందిస్తున్నారు. అలానే ‘ఆంధ్ర పోరి’ ‘రుషి’ చిత్రాల దర్శకుడు రాజ్ మదిరాజు తో ఓ సినిమా నిర్మిస్తున్నాడు. వీటితో పాటు డెబ్యూ డైరెక్టర్ ఆకాష్ రెడ్డి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూడు సినిమాలు కూడా వేటికవే ప్రత్యేకమైన నేపథ్యంలో రూపొందనున్నాయి. బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ అయి ఫోర్బ్స్లో చోటు దక్కించుకున్న సురేష్ రెడ్డి సినీ ఇండస్ట్రీలో కూడా సక్సెస్ అవుతాడేమో చూడాలి.