కరణం మల్లీశ్వరినే మించి పోతుంది సుమీ!

0

గాల్లో ఎగిరి పిడి గుద్దులు గుద్దడం.. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ తో బెంబేలెత్తించడం.. 8 ఫీట్ లెగ్ రైజింగ్ తో మెంటలెక్కించడం… కండలు పెంచి 6 ప్యాక్ యాబ్ తో షాకివ్వడం.. ఇవేవీ క్రేజీ సీకే బ్యూటీ దిశా పటానీకి కొత్తేమీ కాదు. అలాంటిది 75 కేజీల బరువు ఎత్తితేనే అంత ఇదైపోతే ఎలా? సునాయాసంగా జిమ్ లో 150 కేజీలు ఎత్తి అవతలేసే కెపాసిటీ ఈ అమ్మడికి ఉంది. సుశిక్షితులైన కోచ్ ల సమక్షంలో దిశా పటానీ మరో కరణం మల్లీశ్వరినే మించి పోతుంది సుమీ!

దిశా పటాని 75 కేజీ బరువులు ఎత్తి.. దానిని `పీస్ కేక్` అని పిలిచేయడం కుర్రకారును ఆకట్టుకుంది. అంతేనే కేక్ ముక్క విసిరేసినంత తేలిగ్గా ఉందిట తనకు. అంటే 150 కేజీలు అయినా ఇలానే విసిరేస్తుందా కేక్ ముక్కలా? అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు బోయ్స్. ఇక మాజీ ప్రియుడు టైగర్ ష్రాఫ్ చేతిలో 60 కె.జికే ఎంతో బిల్డప్ ఇస్తే దిశా అంతకుమించి అనేస్తోంది మరి. నిరంతరం వ్యాయామశాలలో చెమటలెక్కేలా కసరత్తులు చేసేందుకు ఇష్టపడే తారలలో దిశా పటాని .. టైగర్ ష్రాఫ్ ప్రముఖంగా ఉంటారు. ఇటీవల ఇద్దరు స్టార్లు భారీ బరువులు ఎత్తే వ్యాయామ వీడియోలను పంచుకున్నారు. ఈ జంట దేహదారుఢ్యం బలం చూస్తే ప్రతి ఒక్కరికీ షాక్ తగిలింది.

టైగర్ -దిషా కలిసి కనిపించిన చివరి చిత్రం బాఘి 3. టైగర్ -శ్రద్ధా కపూర్ చిత్రంలోని ఒక పాటలో దిశా అదరగొట్టింది. టైగర్ – దిషా ఇంతకుముందు బాఘి 2 లో కలిసి పనిచేశారు. తదుపరి టైగర్ హీరోపంథి 2 లో తారా సుతారియాతో కలిసి నటించాడు. అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో దీనిని సాజిద్ నాడియా వాలా నిర్మించారు. మరోవైపు దిశా `రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్` చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన నటిస్తోంది. ఇది కాకుండా… ఆమె జాన్ అబ్రహం- అర్జున్ కపూర్ మల్టీస్టారర్ లో… `ఏక్ విలన్ 2`లో కూడా నటిస్తోంది.