‘ఫైటర్’ బ్యూటీకి లేడీ నిర్మాత హాట్ హగ్!

0

హీరోయిన్ ఛార్మి కాస్తా నిర్మాతగా ప్రమోటైన సంగతి తెలిసినదే. సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి నిర్మాతగా మెహబూబా చిత్రం నిర్మించింది. ఆ తర్వాత `ఇస్మార్ట్ శంకర్`తో తన సక్సెస్ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. ఈ మూవీతో పూరీ- ఛార్మి ద్వయం బ్లాక్ బస్టర్ హిట్ ని దక్కించుకుని మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎనర్జిటిక్ రామ్ హీరోగా నభా నటేష్- నిధి అగర్వాల్ హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా భారీ వసూళ్లని తెచ్చిపెట్టింది.

ప్రస్తుతం చార్మి.. పూరితో కలిసి `ఫైటర్` చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ మూవీ కి కరణ్ నిర్మాణ భాగస్వామిగా చేరగా.. దీని ద్వారా ఆయన డిస్కవరీ అయిన యంగ్ హీరోయిన్ అనన్య పాండే తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఈ గురువారం నాడు అనన్య పాండే పుట్టిన రోజు సందన్భంగా చార్మి ఇచ్చిన హగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అనన్యని హగ్ చేసుకున్న ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చార్మి దానికి ఆసక్తికరమైన పోస్ట్ ని షేర్ చేసింది. `పుట్టినరోజు శుభాకాంక్షలు నా మధురమైన అనన్య పాండే. నువ్వు ఏం చేసినా చాలా అద్భుతమైన ఉత్సాహంతో చాలా అద్భుతమైన వైబ్ కలిగి ఉంటుంది.. ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండు` అంటూ అనన్య పాండేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. హాట్ గాళ్ కి హాట్ ప్రొడ్యూసర్ కౌగిలింత అదిరింది అంటూ యూత్ ఒకటే వ్యాఖ్యానంతో వేడెక్కించేస్తున్నారు మరి.