Templates by BIGtheme NET
Home >> Cinema News >> రియాపై సీబీఐ విచారణలో నిగ్గు తేలిన నిజం

రియాపై సీబీఐ విచారణలో నిగ్గు తేలిన నిజం


సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మరణం కేసులో రోజుకో ట్విస్టు ఉత్కంఠ పెంచుతున్నాయి. ఈ కేసులో ప్రియురాలు రియా చక్రవర్తితో ముడిపడిన ఆర్థిక వ్యవహారాలపై సీబీఐ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. రియా ఆమె సోదరుడితో కలిసి సుశాంత్ ఓ కార్పొరెట్ కంపెనీని రన్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే భాగస్వాముల మధ్య ఆర్థిక లావాదేవీలు .. బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు బదిలీ వగైరా అంశాలపై రియాను పదే పదే సీబీఐ ప్రశ్నిస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం.. బిజినెస్ డీల్ లో భాగంగా సుశాంత్ సింగ్ కి చెందిన కోటక్ మహీంద్రా ఖాతా నుంచి 55లక్షల మేర రియా.. ఆమె సోదరుని ఖాతాకు బదిలీ అయ్యాయట. అంతకుమించి వేరే ఏ భారీ లావాదేవీ జరగలేదని ఈడీని అడిగి సీబీఐ నిర్థారించుకుందని తెలుస్తోంది. ఇక ఈ ఏడాదిలో పెద్దగా డబ్బుకు సంబంధించిన లావాదేవీలేవీ జరగలేదు.

అయితే రియా చక్రవర్తి ఏకంగా 15 కోట్ల మేర డబ్బును దుర్వినియోగం చేసిందని ఇంతకుముందు ఆరోపణలు వచ్చాయి. అయితే సుశాంత్ తో రియాకు జాయింట్ అకౌంట్ లేదు. అలాగే సుశాంత్ సింగ్ తండ్రి ఆరోపించినట్టుగా.. రియా డబ్బు మాయం చేసిందంటూ వచ్చిన కథనాల్లో నిజం లేదని తేలింది. గడిచిన రెండ్రోజుల్లో 18 గంటల పాటు దీనిపైనే ఫోకస్ చేసిన సీబీఐ విచారణలో రియాకు ఇప్పుడిలా ఊరట లభించింది. ఇక సుశాంత్ మరణానికి ముందు కొద్దిరోజుల పాటు అతడికి రియా దూరంగా ఉందన్న ఆధారం కూడా లభించింది.