శాండల్ వుడ్ డ్రగ్ కేసు లో వివేక్ ఒబేరాయ్ బావమరిది?

0

శాండల్ వుడ్ డ్రగ్ కేస్ అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు హీరోయిన్ లు రాగిణి దివ్వేది.. సంజన గల్రానీ అరెస్ట్ అయి రిమాండ్ లో వున్నారు. ఇదిలా వుంటే ఈ కేసులో చాలా మంది వున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోజు (మంగళవారం) సెట్రల్ క్రైమ్ బ్యూరో బెంగళూరులో సోదాలు నిర్వహించింది. అయితే ఈ సోదాలు నిర్వహించింది బాలీవుడ్ హీరో వివేక్ ఓబెరాయ్ బావ మరిది ఆదిత్య అల్వ కి సంబంధించిన ప్రాపర్టీస్ లో అని తెలిసింది.

ఆదిత్య అల్వ బాలీవుడ్ హీరో వివేక్ ఓబెరాయ్ బావమరిదే కాకుండా మాజీ మంత్రి జీవరాజ్ అల్వ తనయుడు కూడా కావడం గమనార్హం. ఆదిత్య తో పాటు బెంగళూరు డ్రగ్ కేసులో మరో 15 మంది కూడా కీలకంగా వున్నట్టు సీసీబీ అధికారుల సమాచారం. రైడ్స్ విషయం తెలిసి ఆదిత్య అల్వ పరారీలో వుండటం సంచలనంగా మారింది.

ఆదిత్య అల్వకు చెందిన రిసార్ట్ లో పలువురు కన్నడ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీస్ వీకెండ్ పార్టీలకు హాజరయ్యేవారని అందులో డ్రగ్స్ ప్రధానంగా వాడేవారని తెలుస్తోంది. ఆదిత్య అల్వా హై ప్రొఫైల్ వున్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి కావడం.. అతని తండ్రి మాజీ పవర్ఫుల్ మినిస్టర్ కావడంతో ఈ కేసు మరింత సంచలనాన్ని సృష్టిస్తోంది. ఆదిత్య తల్లి నంది అల్వ కూడా పేరున్న ఈవెంట్ ఆర్గనైజర్. మంచి డ్యాన్సర్ కూడా కావడం గమనార్హం. దీంతో ఈ కేసులో మరిన్ని పెద్ద తలలు వుండే అవకాశం వుందని కన్నడ నాట పుకార్లు వినిపిస్తున్నాయి.