ఎర్ర తివాచీపై బంగారు హంసలు

0

ఎర్ర తివాచీలపై అందగత్తెల ఎంపికల్ని ఎప్పుడూ పరిశీలినకు అర్హమైనవే అయ్యి ఉంటాయి. నటీమణుల రాయల్టీ .. లుక్ డిజైన్.. గ్లామర్ గురించి చర్చ సాగుతుంటుంది. ఈ తరహా క్యాట్ వాక్ లను పరిశీలిస్తే.. బాలీవుడ్ .. హాలీవుడ్ ప్రముఖుల ఎంపికల గురించి పరిశీలిస్తే.. కొన్ని ఆసక్తికర విషయాలే తెలిసాయి. ముఖ్యంగా రెడ్ హాట్ కార్పెట్ పై బంగారు వర్ణం తళుకుబెళుకులు అన్నివేళలా సంథింగ్ హాట్ అని అర్థమవుతుంది.

ప్రియాంక చోప్రా జోనాస్

ప్రపంచ పటంలో భారతదేశం గొప్పతనాన్ని ఇనుమడింపజేసిన ప్రియాంక చోప్రా గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో మెరిసే రాల్ఫ్ లారెన్ గౌనులో అత్యంత ఆకర్షణీయంగా కనిపించింది. డార్క్ పెదవులకు అదిరే నెక్లైన్ ఆమె అందానికి అదనపు సొగసును ఇచ్చాయి.

దీపికా పదుకొనే

బాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా పాపులరైన దీపిక పదుకొనే.. బంగారు వర్ణం డిజైనర్ డ్రెస్ లో తళుక్కుమంటే అది ఎంతందమో.. ఈ పూర్తి-స్లీవ్ బంగారు గౌను ఆమె హాలీవుడ్ అరంగేట్ర చిత్రం XXX: ది రిటర్న్ ఆఫ్ క్జాండర్ కేజ్ ప్రీమియర్ కోసం ధరించింది.

తారా సుతారియా

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ఫేం తారా సుతారియా శాంతను & నిఖిల్ గౌనులో బంగారు బాడీతో తళతళలాడింది. బంగంరం పసుపు రంగు డిజైనర్ లుక్ తో అద్భుతంగా కనిపించింది. డిస్నీ చిత్రం నుండి దారితప్పి వచ్చిందా? అన్నంత అందంగా కనిపించింది.

కృతి సనోన్

భారతదేశంలో ఒక అవార్డు ప్రదర్శన కోసం కృతి సనోన్ రాబర్టో కావల్లి గౌనును ఎంచుకుంది. అది ఆమె అందాన్ని రెట్టింపు చేసింది ఇది క్లిష్టమైన బంగారు ఎంబ్రాయిడరీని కలిగి ఉంది. ఈ దుస్తులలోదేవతనే తలపించింది.

సోనమ్ కపూర్ అహుజా

కొన్నేళ్ల క్రితం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం సోనమ్ తన గోల్డెన్ క్వీన్ లుక్ తో మెరిసింది. రెడ్ కార్పెట్ మీద కస్టమ్ మేడ్ గోల్డ్ ఎలీ సాబ్ గౌను ధరించింది. పొడవైన రైలుతరహా గౌన్ లో ఆకట్టుకుంది.

కైలీ జెన్నర్

జస్టిన్ బీబర్ – హేలీ బీబర్ వివాహ వేడుకకు హాజరైనప్పుడు కళ్లు చెదరగొట్టే మొగల్ రూపంతో మెరిసింది. ఆమె హెమ్లైన్ మ్యాచింగ్ స్టిలెట్టోస్ తో కటౌట్ కి తగ్గట్టే బంగారు గౌనును ఎంచుకుంది.

టేలర్ స్విఫ్ట్

టేలర్ స్విఫ్ట్ కొన్ని సంవత్సరాల క్రితం AMA రెడ్ కార్పెట్ కోసం మెరిసే బెడ్ జజ్డ్ స్ట్రాప్ లెస్ గౌనులో ప్రదర్శనకు దిగింది. పోకర్-స్ట్రెయిట్ హెయిర్ తో ఏకపక్ష పోనీటైల్ లుక్ తో వేడెక్కించేసింది.

సేలేనా గోమేజ్

వానిటీ ఫెయిర్ ఆస్కార్ పార్టీ కోసం సెలెనా ఒక ప్రత్యేక వేషధారణతో మెరుపులు మెరిపించింది. హాల్టర్ ఎమిలియో తరహా సృష్టి ట్రెండ్ ఇది. దీనిని ధరించడంతో షో స్టాపర్ గా నిలిచి ఎవరికీ నోటమాట రాకుండా చేసింది. ఆమె టోన్డ్ కాళ్ళను చూసి ఫిదా అయిపోయారంతా. పైగా డర్టీ టాన్ తో కనిపించినా ఆ రూపం కవ్వించింది.

హేలీ బాల్డ్విన్ బీబర్ (బీబర్ వైఫ్)

వెల్వెట్ గోల్డెన్ ఫిగర్-హగ్గింగ్ గౌనులో ఆమె తళుక్కుమంది. వ్వావ్ అందగత్తె అంటూ పొగిడేశారంతా. అదిరే నెక్ లైన్ తో.. హేలీ బాల్డ్విన్ పరిపూర్ణంగా కనిపించింది. డార్క్ ఐ మేకప్ లుక్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

గిగ్ హడిద్

సదరు అమెరికన్ సూపర్ మోడల్ కొన్ని సంవత్సరాల క్రితం విమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులలో ఇలా ప్రత్యక్షమైంది. స్లీవ్ మ్యాచింగ్ షూస్ తో లేసీ గోల్డెన్ జుహైర్ మురాద్ నంబర్ లో ఈ భామ ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. ఆ దుస్తులు సంథింగ్ స్పెషల్. ఆ టోన్డ్ ఫిగర్ అందరికీ నచ్చింది.

ఇంతకీ మీకు ఇష్టమైన బంగారు దుస్తులు ఏవి? నచ్చిన బంగారు చిలక ఎవరు?