Templates by BIGtheme NET
Home >> Cinema News >> కార్తికేయ.. నీ బ్యాటింగ్ పవర్ చూపించుః లావణ్య త్రిపాఠి

కార్తికేయ.. నీ బ్యాటింగ్ పవర్ చూపించుః లావణ్య త్రిపాఠి


ఆర్ ఎక్స్100 ఫేమ్ కార్తికేయ – లావణ్య త్రిపాఠి జంటగా రాబోతున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ బన్నీవాసు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా ఈ నెల 19న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో.. ప్రమోషన్ పై ఫుల్ ఫోకస్ చేసిన యూనిట్.. డిఫరెంట్ స్టైల్లో ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.

ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించడంతో మంచి హైప్ వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమాలోని ఓ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది యూనిట్. ‘‘ఎట్టాగా పుట్టావురో.. అట్టాగే పోతావురో.. ఉన్నన్నాళ్లూ పండగచేసి పాడెక్కెయ్ రో..’’ అంటూ సాగిపోయే ఫాస్ట్ బీట్ కేక పెట్టిస్తోంది.

ఆ తర్వాత.. నెక్స్ట్ లెవల్ ప్రమోషన్ కోసం హీరో కార్తికేయ జనాల్లో కలిసిపోయారు. రైతు బజారులో వ్యాపారులతో ముచ్చటించిన ఆయన అందరి అటెన్షన్ గ్రాబ్ చేశారు. వచ్చిన పని పూర్తయిన తర్వాత క్రికెట్ నెట్ ప్రాక్టీస్ సెషన్స్ లో ప్రత్యక్షమైంది యూనిట్. హీరోయిన్ లావణ్య త్రిపాఠి బౌలింగ్చేస్తుంటే.. హీరో బ్యాటింగ్ చేశారు. సినిమా యూనిట్ క్రికెట్ ఆడడంతో మంచి ఫోకస్ పడింది.

డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తున్న ఈ మూవీ మరో రెండు చిత్రాలను ఢీకొట్టబోతోంది. మంచు విష్ణు ‘మోసగాళ్లు’ ఆదిసాయికుమార్ ‘శశి’ కూడా ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ మూడు చిత్రాల్లో బాక్సాఫీస్ వద్ద ఏది సత్తా చాటుతుందో చూడాలి.

https://www.youtube.com/watch?v=CK_yjjqRAIA