హీరోయిన్స్ అయినా ఇంత కష్టపడతారా?

0

స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా అమ్మగా అత్తగా కనిపించి మెప్పించిన ప్రగతి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. చిన్న వయసులోనే పెద్ద పాత్రలు చేసిన ఈమెను ప్రేక్షకులు ఒక హుందా అయినా నిండు మహిళగా ఊహించేసుకుంటారు. ఈ లాక్ డౌన్ టైం లో ఆమె మాస్ డాన్స్ లు మరియు చాలా కష్టమైన వర్కౌట్స్ చూసి అంతా ఆశ్చర్య పోతున్నారు. ప్రగతిలో మరో యాంగిల్ ను గత ఆరు నెలలుగా జనాలు చూస్తున్నారు. ఇలా చూసిన వారు మళ్లీ ప్రగతిని అమ్మగా అత్తగా చూడగలరా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక ప్రగతి రెగ్యులర్ గా కనీసం రెండు గంటల వర్కౌట్స్ చేస్తుందట. ఆమె ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుందట. మంచి ఫిజిక్ మరియు ఫిట్ నెస్ కావాలంటే ఖచ్చితంగా వర్కౌట్స్ చేయాల్సిందే. కాని హీరోయిన్స్ అయినా ఈ స్థాయిలో చేరేమో అనిపిస్తుంది. మీరు చేస్తున్న వర్కౌట్స్ మీ అందంను పెంచుతున్నాయని మీరు ఇలాగే ఉండాలంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే కొందరు ఆకతాయిలు మాత్రం మీరు రోజుకు రెండు గంటలు కాదు మరో రెండు గంటలు ఎక్కవుగా వర్కౌట్స్ చేసినా కూడా మీకు హీరోయిన్ గా ఛాన్స్ రాదు. మరి అలాంటప్పుడు ఎందుకు ఇంత కష్టపడటం మేడం అంటూ ప్రశ్నిస్తున్నారు.

హీరోయిన్స్ కూడా ఫిజిక్ విషయంలో ఇంతగా కష్టపడరేమో మీరు మాత్రం ఇంతగా తాపత్రయ పడుతూ కష్టపడటం అభినందనీయం అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ప్రగతి వర్కౌట్ వీడియోలు మరియు డాన్స్ వీడియోల గురించి ఈమద్య కాలంలో రెగ్యులర్ గా చర్చ అయితే జరుగుతూనే ఉంది.