రామ్ చరణ్ బతుకమ్మ డాన్స్

0

తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ ఇటీవలే పూర్తి అయ్యింది. బతుకమ్మ దసరా అంటూ సెలబ్రెటీలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫొటోలు వీడియోలు షేర్ చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ బతుకమ్మ డాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఏడాది చరణ్ బతుకమ్మ వేడుకలో పాల్గొనకున్నా ఆయన పాత వీడియో ఇప్పుడు ఫ్రెష్ గా వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలోని ఆయన ఫ్యాన్ పేజీలో బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియోను షేర్ చేశారు. బతుకమ్మ పాటకు చరణ్ కొన్ని సెకన్ల పాటు డాన్స్ చేశాడు.

రామ్ చరణ్ గతంలో ఒక సారి అత్తవారి ఊర్లో దసరా పండుగకు హాజరు అయ్యాడు. ఆ సందర్బంగా స్థానికులు బతుకమ్మ వేడుకలకు చరణ్ ను ఆహ్వానించగా వెళ్లాడు. అప్పుడే ఇలా బతుకమ్మ పాటకు డాన్స్ చేశాడు. అప్పుడు ఈ వీడియో వైరల్ అయ్యింది. మళ్లీ ఇప్పుడు ఒక చరణ్ ఫ్యాన్ షేర్ చేయడంతో మళ్లీ వైరల్ అయ్యింది. చరన్ బతుకమ్మ డాన్స్ ను ప్రస్తుతం నెటిజన్స్ తెగ షేర్ చేస్తున్నారు.

ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే ఒక వైపు జక్కన్న దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్నాడు. ఆ సినిమాతో పాటు ఆచార్య సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ తర్వాత చరణ్ చేయబోతున్న సినిమా విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. పలువురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. కాని అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.