ఆచార్యలో చరణ్ ఆహా.. ఓహో..!

0

మెగాస్టార్ చిరంజీవి కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రంలో రామ్ చరణ్ నటించడం దాదాపుగా ఖాయం. అయితే ఆ పాత్ర ఏంటీ ఆ పాత్ర ఎంత సమయం ఉంటుంది కథలో ఆ పాత్ర ప్రాముఖ్యత ఎంత అనే విషయంలో ఇప్పటి వరకు యూనిట్ సభ్యుల నుండి క్లారిటీ రాలేదు. అసలు ఆచార్యలో చరణ్ నటించబోతున్నాడు అనే విషయంను యూనిట్ సభ్యులు అధికారికంగా ఎప్పుడు ఎక్కడ కూడా ప్రకటించలేదు. కాని లీక్ మాత్రం ఇచ్చారు. దాంతో అభిమానులు ఆచార్యలో చరణ్ పాత్ర గురించి ఓ రేంజ్ లో ఊహించేసుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా ఆచార్య నుండి ఫస్ట్ లుక్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చరణ్ పాత్ర గురించి మరోసారి ప్రచారం మొదలయ్యింది. రామ్ చరణ్ పాత్ర కేవలం అర్థ గంట ఉంటుందని ఆ అర్థ గంట సినిమా చూసే ప్రేక్షకులు ఒల్లు గగుర్లు పొడిచే విధంగా సీన్స్ ఉంటాయని అంటున్నారు. కొరటాల ప్రత్యేకమైన శ్రద్దతో చరణ్ సీన్స్ ను రాశి ఉంటాడు అంటూ మెగా ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

చిరంజీవి మరియు రామ్ చరణ్ కలయిక సీన్స్ సినిమాకే హైలైట్ గా ఉండేలా కొరటాల తీస్తాడని వారు అనుకుంటున్నారు. ఆచార్యలో చరణ్ కనిపించడం చాలా పెద్ద ప్లస్. అది ఒక పవర్ ఫుల్ పాత్రలో అద్బుతమైన యాక్షన్ సీన్స్ ఆయనకు ఉంటే సినిమా స్థాయి ఎక్కడికో వెళ్తుంది. ఆ విషయం కొరటాలకు బాగా తెలుసు. అందుకే ఆయన ఖచ్చితంగా చరణ్ పాత్రను ఆహా.. ఓహో అనేట్లుగా తీర్చి దిద్డడం ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.