క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్

0

రానా పెళ్లి ఏమో కాని సమంత అభిమానులకు కన్నుల పండుగ అయ్యింది. రానా మిహీకా సంగీత్ కార్యక్రమం నుండి మొదలుకుని నేటి వరకు కూడా సమంత కొత్త కొత్త డ్రస్ లు విభిన్నమైన స్టైల్స్ లో మెరుస్తూనే ఉంది. పెళ్లి తర్వాత రోజు చేనేత చీరలో మెరిసిన సమంత నేడు గ్రీన్ చుడిదార్ లో ఆకట్టుకుంది. అత్యంత క్యూట్ కుట్టి అంటూ అభిమానులు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. సింపుల్ గ్రీన్ చుడిదారిలో పక్కింటి క్యూట్ అమ్మాయిగా ఉన్నారు మేడం అంటూ ఒక అభిమాని కామెంట్ చేశారు.

సమంత ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫొటోకు ఆకు పచ్చలో నిమగ్నం అయ్యి ఉన్నట్లుగా ఉందంటూ పోస్ట్ పెట్టింది. సమంత గత మూడు నాలుగు రోజుల్లో ధరించిన డ్రస్ ల్లోకి ఇది స్వీట్ అండ్ సింప్లీ సూపర్ అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చుడిదార్ లో చాలా అరుదుగా సమంతను చూస్తూ ఉంటాం. ఈసారి ఆమెను ఫుల్ గ్రీన్ లో చూడటంతో ఫ్యాన్స్ కొత్తగా ఫీల్ అవుతున్నారు.

ఈ ఏడాదిలో కొత్త సినిమాలకు అధికారికంగా ఓకే చెప్పని సమంత ఇప్పటి వరకు కొత్త సినిమాను మొదలు పెట్టలేదు. తమిళంలో రెండు సినిమాలను ఈమె చేయబోతున్నట్లుగా అయితే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.