చిన్నదాని స్టెప్పులకు టిక్ టాక్ షేక్.. రికార్డులు బద్దలు

0

టిక్టాక్ మనదేశంలో నిషేధించినా ప్రపంచవ్యాప్తంగా దీని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. టిక్టాక్ ఎంతో మంది యువతకు ఎంటర్టెయిన్మెంట్ ఇవ్వడమే కాదు..! సెలబ్రిటీలను తయారుచేసింది. యువతకు ఉపాధి కల్పించింది. ఇప్పటికే పలుదేశాల్లో యువత టిక్టాక్ను వాడుతున్నారు. వీడియోలు చేసుకుంటూ ఉపాధి పొందేవాళ్లు ఉన్నారు. అయితే ఈ టిక్టాక్ మన దేశంలో చాలామంది కొంపలు కూడా కూల్చింది. కొందరి ఉద్యోగాలు పోగొట్టింది. ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు తమ కార్యాలయాల్లో పనులు చేసుకోకుండా ఈ టిక్టాక్కు బానిసలుగా మారి తమ ఉద్యోగాలు కోల్పోయారు. టిక్టాక్లో ఫాలోవర్స్ పెరగలేదని ఆత్మహత్యలు చేసుకున్నవారు ఉన్నారు.

అయితే టిక్టాక్లో ఉన్న మంచి చెడులను పక్కనపెడితే అమెరికాకు చెందిన ఓ పదహారేళ్ల పిల్ల స్టార్గా మారిపోయింది. ఆమె టిక్ టాక్ లో 100 మిలియన్ (10 కోట్లు) ఫాలోవర్స్ను సంపాదించుకున్నది. చార్లీ డీ అమీలియో అనే 16 ఏళ్ల అమ్మాయి.. టిక్టాక్లో తొలిసారిగా 10 కోట్ల మంది ఫాలోవర్స్ మార్క్ను చేరుకుంది. ఇప్పటివరకు 100 మిలియన్ల ఫాలోవర్స్ ను పెంచుకొని రికార్డ్ సృష్టించింది. అయితే ఆమె 2019లోనే టిక్టాక్లో వీడియోలు స్టార్ట్చేసి ఏడాది తిరక్కుండానే ఈ ఘనత సాధించింది. హాలీవుడ్ హీరో విల్స్మిత్ కంటే రెండింతలు ఫాలోవర్స్ను పెంచుకొని రికార్డు సృష్టించింది. అయితే ఆమె పెడుతున్న వీడియోలు జనాలను విశేషంగా ఆకట్టకుంటున్నాయి. మనదేశంలో టిక్టాక్ బ్యాన్ అయినా ప్రపంచదేశాల్లో మాత్రం దానికి క్రేజ్ తగ్గడం లేదు.

చైనాకు చెందిన ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోయింది. చాలా తక్కువకాలంలోనే యువతను ఆకర్షించింది. చైనా యాప్ కావడం.. ఈ యాప్తో యువత తప్పుదారి పడుతుండటంతో దీన్ని మనదేశంలో బ్యాన్ చేశారు. అయితే టిక్టాక్ మేనేజ్మెంట్ను మార్చుకొని తిరిగి ఇండియాలోకి అడుగుపెట్టబోతున్నదంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు అటువంటి అధికారిక ప్రకటన ఏదీ బయటకు రాలేదు.