మెగా మనవరాలి అభినయం వాచకం చూశారా?

0

కళారంగానికి మెగా ఫ్యామిలీ చేస్తున్న సేవల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇప్పటికే ఈ కుటుంబం నుంచి డజను మంది హీరోలు పరిశ్రమకు అంకితమయ్యారు. ఇక ఇదంతా ఒకెత్తు అనుకుంటే.. ఈ కుటుంబం నుంచి నిహారిక కొణిదెల కథానాయికగా ప్రయత్నించింది. అలాగే మెగాస్టార్ కుమార్తె సుశ్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా రాణించారు. మనవలు మనవరాళ్లు కూడా కళారంగానికే అంకితం అవుతారనడంలో ఎలాంటి సందేహాల్లేవ్.

అయితే ఇదంతా ఎలా సాధ్యం? అంటే మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆ కుటుంబంలో ప్రతిభను వెతికి మరీ ఎంకరేజ్ చేయడంతోనే ఇది సాధ్యమవుతోంది. ఇప్పటికే తన వారసులను.. కుటుంబంలో పలువురికి మెగాస్టార్ ఆశీస్సులు అందించి మార్గనిర్ధేశనం చేసి ఎదిగేందుకు సాయపడ్డారు. ఇప్పుడు మరో కళాకారిణి ఉద్భవించింది ఈ కుటుంబంలో.

మెగాస్టార్ పెద్ద కుమార్తె సుస్మిత కుమార్తె సంహితకు నటన అంటే చాలా ఇష్టం. తను ఇప్పటికే ఇంట్లో నటనను ప్రాక్టీస్ చేస్తోంది. తాత గారు వినిపించే క్లాసులు వింటోంది. ఇదిగో ఇలా లేటెస్టుగా ఏకంగా పౌరాణిక డైలాగ్ నే అందుకుంది అంటే సంహిత ట్యాలెంట్ ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్నిటినీ మించి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా మనవరాలి ప్రతిభకు మురిసిపోయి ఎంకరేజ్ చేస్తున్నారు. ఎంతో క్లిష్టమైన డైలాగులు చెబుతున్న సంహిత ప్రతిభ మైమరిపిస్తోంది. ఈ వీడియోని చిరు స్వయంగా ఇన్ స్టా వేదికగా షేర్ చేయడంతో అభిమానుల్లో జోరుగా వైరల్ అయిపోతోంది. పిల్లల అభిరుచిని గ్రహించి పేరెంట్ ప్రోత్సహిస్తే ఎంత ఎత్తుకు అయినా ఎదుగుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.