ఆ వ్యక్తి ఎవరో చెప్పుకోండి చూద్దాం: మెగాస్టార్

0

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సెలబ్రిటీలు అందరూ తాము తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఫోటోగ్రఫీ అనేది ఒక కళ.. ఎన్నో మధురమైన.. మరిచిపోలేని జ్ఞాపకాలను మనకు అందిస్తుంది ఫోటో. గతాన్ని మనం తిరిగి పొందలేకపోవచ్చు కానీ మన జీవితంలో గడిపిన మధుర క్షణాలను మాత్రం ఫోటోల రూపంలో బంధించొచ్చు. ఈ క్రమంలో ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి కూడా ఫోటోల రూపంలో మరిచిపోలేని అనుభూతులను అభిమానులతో పంచుకున్నారు.

కాగా చిరంజీవి ‘నేను మొదటి ఫోటోని వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా మీతో పంచుకుంటాను’ అని ఓ స్పెషల్ ఫోటో ట్వీట్ చేసాడు. ఆ తర్వాత ఐదుగురు చిన్నపిల్లలున్న వరుసగా నిలబడి ఉన్న ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను ట్విటర్ లో పోస్ట్ చేశారు చిరు. ”నేను తీసిన మొదటి ఫోటో.. ఈ అయిదుగురిలో ఓ వ్యక్తి మీకు బాగా తెలుసు.. చెప్పుకోండి చుద్దాం” అంటూ మెగాస్టార్ ట్విట్టర్ ఛాలెంజ్ విసిరారు. చిరు కెమెరా నుంచి వచ్చిన ఈఫోటోపై నెటిజన్స్ భారీగా స్పందించారు. ఆ ఐదుగురి మధ్యలో ఉంది చిన్నప్పటి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అని మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఫొటోలో ఉంది పవన్ కల్యాణో కాదో మీరే చెప్పండి..!