ప్రభుదేవా లారెన్స్ తర్వాత బెస్ట్ కొరియోగ్రాఫర్ కోసం మెగాస్టార్ సెర్చ్?

0

ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా.. ది గ్రేట్ రాఘవ లారెన్స్ మాస్టార్ అంటే మెగాస్టార్ చిరంజీవికి ఎంతటి అభిమానమో తెలిసిందే. ఆ ఇద్దరి కెరీర్ జర్నీకి అవసరమైన బూస్టప్ ఇచ్చింది చిరునే. ఈ విషయాన్ని ఆ ఇద్దరూ చాలా ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ఇండస్ట్రీ బెస్ట్ డ్యాన్సర్ గా చిరంజీవి ది బెస్ట్ కొరియోగ్రాఫర్లను వెతికి పట్టుకునేవారు. ఆ క్రమంలోనే ప్రభుదేవా.. లారెన్స్ వంటి యంగ్ ట్యాలెంట్ ను అప్పట్లో ఎంకరేజ్ చేశారు.

ప్రస్తుతం ప్రభుదేవా.. లారెన్స్ మాస్టార్ ఇద్దరూ వారి వృత్తిలో బిజీ బిజీ. సేమ్ టైమ్ చిరంజీవి రీఎంట్రీ.. కంబ్యాక్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఖైదీనంబర్ 150.. సైరా నరసింహారెడ్డి తర్వాత వరుసగా నాలుగు కమర్షియల్ సినిమాల్లో నటించేందుకు చిరు సంతకం చేశారు. ఇక కమర్షియల్ సినిమా అంటేనే డ్యాన్సులతో హోరెత్తించాలి. మెగా ఇమేజ్ కి ఏమాత్రం డ్యామేజీ లేని విధంగా అద్భుతమైన కొరియోగ్రఫీ అందించే ట్యాలెంట్ అవసరం. అందుకే ఇప్పుడు ది బెస్ట్ కొరియోగ్రాఫర్లను ఎంపిక చేసే ప్రక్రియలో బాస్ ఉన్నారని సమాచారం.

ప్రస్తుతం వరుసగా రీమేక్ సినిమాలకు మెగాస్టార్ సంతకాలు చేశారు. తమిళ సూపర్ హిట్ వేధాళం రీమేక్ కోసం పని చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఎమోషనల్ డ్రామాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నారు. అలాగే కొన్ని డ్యాన్స్ నంబర్ల కోసం కొత్త కుర్రాళ్లను వెతకాలని మెగాస్టార్ సూచించారట. ఇండస్ట్రీ బెస్ట్ కొరియోగ్రఫీ ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయాలని ఆలోచిస్తున్నారని సమాచారం.

అలాగే ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్ గా రామ్ లక్ష్మణ్ పేరును సూచించారని.. ఫైట్స్ హైలైట్ గా ఉండాలని చిరు కోరారని తెలుస్తోంది. తాజా ఆఫర్ తో రామ్ లక్ష్మణ్ చాలా సంతోషంగా ఉన్నారట. ఇతర తారాగణం మరియు సిబ్బంది ప్రస్తుతానికి ప్రవేశిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి నుంచి చిత్రీకరణకు వెళ్లనందని తెలుస్తోంది.