రాంచరణ్ ను హెచ్చరించిన చిరంజీవి!

0

కొత్త ఒక వింత.. పాత ఒక రోత.. ప్రతీసారి తన అభిమానులు మీడియాతో మాట్లాడడానికి చిరంజీవి ప్రెస్ మీట్ పెట్టేవారు. దానికి బోలెడంత సమయం ఖర్చు వృథా అయ్యేవి. అందుకని తన ఊహలు ఊసులు బాసులు పంచుకునేందుకు ఈ ఏడాదే సోషల్ మీడియాలోకి వచ్చాడు. ట్విట్టర్ ఫేస్ బుక్ లో ఖాతా తెరిచాడు.

అయితే చిరంజీవి సోషల్ మీడియాలోకి రాక సందర్భంగా తన కుమారుడు హీరో రాంచరణ్ ను హెచ్చరించాడట.. ‘నేను వస్తున్నాను.. జాగ్రత్త’ అని జలక్ ఇచ్చాడట..

చిరంజీవి సోషల్ మీడియాలో ఇప్పుడు యమ యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రతీరోజు తన విశేషాలు.. ఇతర విషయాలు.. పుట్టినరోజులు ఇతరులకు శుభాకాంక్షలు.. సర్వం వాటిపై స్పందిస్తూ యాక్టివ్ గా ఉంటున్నారు.ఈ వయసులో చిరంజీవి ఇంత యాక్టివ్ గా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో రాంచరణ్ అస్సలు అప్డేట్స్ ఇవ్వకుండా కామ్ గా ఉంటున్నారు. బహుషా సమయాభావం.. బిజీగా ఉండడమే కారణం కావచ్చు.

ఇదే విషయాన్ని రాంచరణ్ పంచుకున్నారు. ‘‘నాన్నగారు చాలా సరదాగా సోషల్ మీడియాలో ఉంటున్నారు. చాలా యాక్టివ్ గా ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారు. తనకంటే కూడా సోషల్ మీడియాలో అప్డేట్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఆయన కామ్ గా ఉంటే బాగోదు.. నేను ఎక్కువగా ఉండలేకపోతున్నా.. అదీ బాలేదు’’ అంటూ రాంచరణ్ తన తండ్రి తనను సోషల్ మీడియాలో దాటేశాడని.. దూసుకుపోతున్నాడని చెప్పుకొచ్చాడు.