ధోని జెర్సీ నం.7కి కూడా రిటైర్మెంట్ ఇవ్వండి!!

0

Dinesh Karthik urges BCCI to retire jersey No 7 donned by Dhoni

Dinesh Karthik urges BCCI to retire jersey No 7 donned by Dhoni

ప్రపంచ క్రికెట్ నుంచి ఓ దిగ్గజ క్రికెటర్ వైదొలిగాడు. టీమిండియా మాజీ క్రికెట్ మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ధోని అందరూ సోషల్ మీడియా ద్వారా గుర్తు చేసుకుంటున్నారు.

టీమిండియాకు ఆడేటప్పుడు ధోని వేసుకున్న ఇండియా జెర్సీ నంబర్ 7 అంటే తెలియని భారత క్రికెట్ అభిమానులు లేరు. 7 నంబర్ అనగానే ధోని గుర్తొస్తాడు.

అంతర్జాతీయ క్రికెట్ కు ధోని గుడ్ బై చెప్పడంతో ఆ జెర్సీకి కూడా రిటైర్ మెంట్ ప్రకటించాలని.. అతడి గౌరవార్థం భారత ఆటగాళ్లు ఆ నంబర్ జెర్సీ వేసుకోకుండా చూడాలని దినేష్ కార్తీక్ బీసీసీఐని కోరాడు.

ధోని పుట్టినరోజు ఏడో నెల ఏడో తారీఖు. అతడి అభిమాన ఫుట్ బాలర్లు బెక్ హామ్ రొనాల్డో కూడా 7వ నంబర్ జెర్సీతోనే ఆడారు. అందుకే 7వ నంబర్ జెర్సీ అంటే ధోనికి అభిమానం. అందుకే దిగ్గజ ధోని గుర్తుగా ఆ నంబర్ జెర్సీని ఎవరికి ఇవ్వవద్దన్న డిమాండ్ ఇప్పుడు వినిపిస్తోంది.