ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ.. నిజాయితీగా వ్యవహరిస్తారనే పేరుంది చిరంజీవికి. అందుకే.. ఆయన రాజకీయాల్లో రాణించలేకపోయారని కూడా అంటారు. పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పిన తర్వాత తిరిగి సినిమాల్లో బిజీ అయ్యారు మెగాస్టార్. అరవయ్యేళ్ల వయసులోనూ.. ఇరవై ఏళ్ల కుర్రాడిలా వరుస సినిమాలు చేస్తూ అందరిచేతా ఔరా అనిపిస్తున్నారు.
చిరు అప్ కమింగ్ మూవీ ‘ఆచార్య’. కరోనా గోల లేకుంటే.. ఈ సమయానికి థియేటర్లలో సందడి చేస్తూ ఉండేది. లాక్ డౌన్ పరిస్థితులు రావడంతో.. సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇక షూటింగులు మొదలు పెట్టగానే లూసీఫర్ రీమేక్ ను లైన్లోకి తేవడానికి సిద్ధమవుతున్నారు.
అయితే.. తాజాగా నీలకంఠాపురం దేవాలయాలను తెరిచిన సందర్భంగా సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశాన్నిచ్చారు చిరు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత నీలకంఠ రఘువీరారెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాయలసీమకు నీళ్లు తెచ్చే సినిమాలో తాను నటించానని రఘువీరారెడ్డి మాత్రం సీమకు నీళ్లు తెచ్చి నిజమైన హీరోగా నిలిచారని కొనియాడారు. ఈ వీడియోను రఘువీరారెడ్డి ట్విటర్ లో షేర్ చేశారు.
కాగా.. ఈ వీడియోలో నల్ల జుట్టు.. తెల్లగడ్డంతో సాల్ట్ పెప్పర్ లుక్ లో సరికొత్తగా కనిపించారు మెగాస్టార్. సాధారణంగా ఎప్పుడూ ఇలాంటి లుక్ లో కనిపించారు. లాక్ డౌన్ కాబట్టి ఇంట్లో ఉండడం వల్ల ఈ లుక్ లో కనిపించారా? లేదంటే.. రాబోయే లూసీఫర్ సినిమాలో ఇలాంటి లుక్ లో ఏమైనా కనిపిస్తారా? అని ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్.
Best wishes from former Central Minister, Megastar Chiranjeevi Garu, on the occasion of the inauguration of Neelakantapuram Temples. @KChiruTweets #NeelakantapuramGroupOfTemples #IncredibleIndia pic.twitter.com/0wNMLEZeb5
— Dr. N Raghuveera Reddy (@drnraghuveera) June 19, 2021
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
