చిరంజీవి ఇలా దొరికిపోయాడేంటి?

0

మెగాస్టార్ చిరంజీవి కొన్ని రోజుల కిందట రిలీజ్ చేసిన గుండు లుక్ సెన్సేన్ క్రియేట్ చేసింది. ఇంకొన్ని రోజుల్లో ‘ఆచార్య’ సినిమా చిత్రీకరణ మొదలవుతుండగా చిరు ఇలా గుండు చేయించుకున్నాడేంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ లుక్ ‘వేదాలం’ రీమేక్ కోసం చేసిన ట్రయల్ షూట్లో భాగంగా మార్చుకున్నది అన్నారు. ఇంకా రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఐతే మరీ నున్నగా తయారైన చిరు గుండు ఒరిజినలేనా అని కొంచెం సందేహాలు కలిగినప్పటికీ.. చిరు అలా అందరినీ ఫూల్స్ను చేస్తారా అన్న అనుమానాలూ వచ్చాయి. ఐతే ఇప్పుడు చిరు నిజంగానే జనాల్ని ఫూల్స్ను చేశారు. అది ఒరిజినల్ గుండు కాదని.. ప్రోస్థెటిక్ మేకప్ నిపుణుల మాయాజాలంతో చిరు గుండు లుక్లోకి మారారని ఓ వీడియో ద్వారా స్పష్టత ఇచ్చారు.

ఐతే చిరు ఇలా అందరినీ ఫూల్స్ను చేయడం బాగానే ఉంది కానీ.. ఒక చోట ఆయన తప్పులో కాలేసి దొరికిపోయారు. తల మీద ‘గుండు మేకప్’ వేయడానికి ముందు చిరు ఒరిజినల్ హేర్ ఎంత ఉందన్నది బయటపడిపోయింది. నెత్తి మీద చిరుకు ఉన్నది చాలా తక్కువ జుట్టు అని.. ఆయనకు బట్టతల వచ్చిందని స్పష్టమైంది. నిజానికి చిరు 90ల ఆరంభంలో చేసిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలో ‘ప్రియతమా..’ పాటలో చూస్తే అప్పటికే జుట్టు చాలా పోయింది. పలుచబడింది. ఐతే 90ల చివర్లోకి వచ్చేసరికి ఒత్తైన జుట్టుతో కనిపించారు. చాలామంది హీరోల్లాగే చిరు కూడా విగ్గు లాంటిది కాకుండా హేర్ సెట్ చేసుకున్నాడనే అనుమానాలు జనాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ అనుమానే నిజమై చిరు జుట్టుకు సంబంధించిన రహస్యం బయటపడిపోయింది. నందమూరి బాలకృష్ణలా విగ్గు పెట్టుకున్నట్లు తెలియకుండా మేనేజ్ చేసే స్టార్లు టాలీవుడ్లో ఇంకా చాలామంది ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే వారిది ఒరిజినల్ హేర్ కాదనే విషయం స్పష్టంగా తెలిసిపోతుంది.