అడ్డు చెప్పక చెలరేగింది.. ఎవరీ రెబల్ రాణి?

0

కరిష్మా తన్నా ఇటీవల వైరల్ గా పాపులరవుతోంది ఈ అమ్మడు. సోషల్ మీడియాల పుణ్యమా అని ఇటు టాలీవుడ్ లోనూ ఈ భామకు ఫాలోయింగ్ పెరుగుతోందట. ఊర్వశి రౌతేలా.. అనిత హసనందానీ.. మౌనీ రాయ్ .. తర్వాత బుల్లితెర నుంచి దండయాత్రకు బయల్దేరిన భామగా ఈ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. యూత్ లో ఇప్పటికే ఓ రేంజులో కిక్కు ఎక్కించిన ఈ బ్యూటీ వెండితెర అవకాశాల కోసం గ్లామర్ గేట్లు ఎత్తేసేందుకు వెనకాడనని సిగ్నల్ ఇచ్చేసింది.

నచ్ భలియే.. ఝలక్ దికలాజా లాంటి టీవీ కార్యక్రమాలతో పాపులరై అటుపై పెద్దతెరకు పరిచయమైన కరిష్మా తన్నా ప్రస్తుతం ఒకట్రెండు సినిమాలు చేస్తోంది. అందంతో పాటు వేడెక్కించే కంటెంట్ ఈ భామలో కొదేవే లేదనేందుకు ఇదిగో ఈ మ్యాగజైన్ షూట్ చూస్తే తెలిసిపోతోంది. ప్రఖ్యాత గ్రాండియర్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ కోసం చెలరేగి మరి ఫోజులిచ్చింది.

ఆరెంజ్ సూటులోన అందాల ఆరబోత ఆ రేంజులోనే కిర్రెక్కిస్తోంది యూత్ ని. ఇలాంటి ప్రయత్నం చూశాక అయినా ఛాన్సులు రాకుండా పోతాయా? అంటూ పంచ్ లు వేస్తున్నారు. గుజరాతీ అయిన ఈ అమ్మడు బాలీవుడ్ నటుడు ఉపేన్ పటేల్ తో డేటింగ్ చేసి పాపులారిటీ దక్కించుకుంది. బిగ్ బాస్ తర్వాత కత్రోంకి కిలాడీ సీజన్ 10 లోనూ ఈ భామ బుల్లితెర వీక్షకులను ఆకట్టుకుంది.