టాలీవుడ్ లో సిసలైన ఫ్యామిలీ మ్యాన్ గా మెగాస్టార్ చిరంజీవి పేరు ప్రఖ్యాతుల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా.. ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి ఎంతో ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం వల్లనే అంతటి గుర్తింపు. ఇప్పటికీ ఉమ్మడి కుటుంబ సాంప్రదాయానికి విలువనిస్తూ పండగలు పబ్బాల వేళ ఇంటిల్లిపాదీ ఒకేచోట చేరి సంబరాలు జరుపుకోవడం చూస్తున్నదే. ముఖ్యంగా ఆ ఇంటి ఆడపడుచులంతా ఓచోట చేరి ఎంతో సందడి చేస్తుంటే అది కన్నులపండుగనే తలపిస్తుంది.
సంక్రాంతి.. దీపావళి.. దసరా.. క్రిస్మస్ .. ఇలా పండగ ఏదైనా కానీ వీరంతా ఓచోట చేరి సందడి చేస్తున్నారు. ఇక చిరంజీవి పెద్ద కుమార్తె సుశ్మిత ఫ్యామిలీతో పాటు.. చిన్న కుమార్తె శ్రీజ ఫ్యామిలీ ఈ సంబరాల్లో ఎంతో సందడి చేస్తుంటారు. ఇలాంటి వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి తన మనవరాళ్లతో సమయం స్పెండ్ చేస్తున్న ఫోటోలు వీడియోలు ఇంతకుముందు అభిమానుల్లో వైరల్ అయ్యాయి.
మరోసారి తన మనవరాలు (చిన్న కుమార్తె శ్రీజ కుమార్తె) పై చిరు ఎంతటి ఆప్యాయతను కురిపిస్తున్నారో చూశారు కదా.. తాతయ్య అంటే ఆ మనవరాలికి ఎంతో ఇష్టం. మనవరాలు అంటే తాతయ్యకు అంతే ప్రాణం. జూబ్లీహిల్స్ లో మెగాస్టార్ నివసిస్తున్న రాజప్రాకారంలో ఈ దృశ్యం ఎంతో చూడముచ్చటగా ఉందని అభిమానులు తమ ప్రేమను కురిపిస్తూ ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు. మెగాస్టార్ ఓవైపు ఆచార్య చిత్రీకరణలో బిజీగా ఉన్నా వీలున్నప్పుడల్లా ఇలా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతుంటారన్నమాట.