Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘చిన్నా’తో చియాన్ 62 ఇంట్రెస్టింగ్!

‘చిన్నా’తో చియాన్ 62 ఇంట్రెస్టింగ్!


చియాన్ విక్ర‌మ్ ‘పొన్నియ‌న్ సెల్వ‌న్’ స‌క్సెస్ తో మంచి ఊపు మీదున్న సంగ‌తి తెలిసిందే. చాలా గ్యాప్ త‌ర్వాత విక్ర‌మ్ వ‌చ్చిన స‌క్సెస్ ఇది. వ‌రుస వైఫ‌ల్యాల న‌డుమ ఓ భారీ విజ‌యం విక్ర‌మ్ ని ఊపిరిపోసిన చిత్రంలా పొన్నియ‌న్ సెల్వ‌న్ నిలిచింది. స‌క్సెస్ క్రెడిట్ విక్ర‌మ్ ఒక్క‌డికే క‌ట్ట‌బెట్ట‌డానికి లేక‌పోయి నా..ఆయ‌న ఉన్న ఫేజ్ లో ఆ స‌క్సెస్ ఎంతో కీల‌కంగా మారింది. ఇప్పుడిదే రెట్టించిన ఉత్సాహంతో ‘తంగ‌లాన్’ పూర్తి చేస్తున్నాడు.

పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఇ ప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు..విక్ర‌మ్ లుక్ ప్ర‌తీది సినిమాపై అంత‌కంత‌కు భారీ హైప్ తీసుకొ స్తుంది. ఆఘోరాని త‌ల‌పించి విక్ర‌మ్ గెట‌ప్ ఒక్క‌టే సినిమా రేంజ్ నే మార్చేసింది. మ‌రోసారి విక్ర‌మ న‌ట విశ్వ‌రూపం ‘తంగ‌లాన్’ లో చూడ‌బోతున్నాం అంటూ యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తుంది.

అలాగే ‘ధృవ‌న‌క్ష‌త్రం’ సినిమా సైతం రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ రెండు రిలీజ్ కాకుండా తాజాగా చియాన్ 62వ చిత్రం షురూ చేసాడు. ‘చిన్నా’ ఫేం య‌స్ .యు కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో సెట్స్ కి తీసుకెళ్ల‌డానికి రెడీ అవుతున్నారు. ఇది ఒక డిఫ‌రెంట్ జోనర్ చిత్ర‌మ‌ట‌. ఇప్ప‌టివ‌ర‌కూ ఏ ద‌ర్శ‌కుడుగానీ..హీరోగానీ ట‌చ్ చేయ‌ని ఓ కొత్త పాయింట్ తో రూపొందుతుంద‌ని స‌మాచారం.

ఈ చిత్రానికి జీ. విప్ర‌కాష్ కుమార్ సంగీతం అందించ‌నున్నారు. రియా శిభు భారీ బడ్జెట్ తో నిర్మించ డానికి ముందుకొచ్చారు. విక్ర‌మ్ హీరోయిన్ గా ఓ బాలీవుడ్ న‌టిని ఎంపిక చేసే ఆలోచ‌న‌లో ఉన్నారుట‌. అలాగే మ‌రికొంత మంది ద‌క్షిణాది-ఉత్త‌రాది న‌టుల్ని సైతం ప్రాజెక్ట్ లో భాగం చేయ‌ల‌ని ద‌ర్శ‌కుడు ప్లాన్ చేస్తున్నారుట‌. వీలైతే పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానూ మ‌లిచే అవ‌కాశం ఉంద‌ని కోలీవుడ్ మీడియాలోక‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.