Templates by BIGtheme NET
Home >> Cinema News >> పింక్ చీర కట్టులో విజ్జీ పాప అదుర్స్‌

పింక్ చీర కట్టులో విజ్జీ పాప అదుర్స్‌


పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు శ్రీలీల ను దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పరిచయం చేసిన విషయం తెల్సిందే. ఆయన సెలక్షన్‌ సూపర్‌ అంటూ మరోసారి నిరూపితం అయింది. పెళ్లి సందడి సినిమా ఫ్లాప్ అయినా కూడా శ్రీలీల హిట్ అయింది. ప్రస్తుతం టాలీవుడ్‌ లో మోస్ట్‌ బిజీ హీరోయిన్స్ జాబితాలో శ్రీలీల ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు.

వరుసగా ఫ్లాప్స్ పడ్డా కూడా శ్రీలీల క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా తో సంక్రాంతికి శ్రీలీల ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా కచ్చితంగా శ్రీలీల కి మరింతగా క్రేజ్ తెచ్చి పెడుతుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్‌ మీడియాలో తాజాగా శ్రీలీల చీర కట్టు ఫోటోలతో కన్నుల విందు చేసింది.

భగవంత్ కేసరి సినిమాలో విజ్జీ పాప గా నటనతో మరియు లుక్స్ పరంగా అలరించిన శ్రీలీల తాజాగా ఇలా పింక్ చీర కట్టు ఫోటోలతో నెటిజన్స్ ని మరియు తన అభిమానులను ఫిదా చేసింది. మోడ్రన్‌ డ్రెస్‌ లతో పాటు ఇలా చీర కట్టు లో కూడా అందంగా, ఆకర్షణీయంగా కనిపించగల సత్తా ఉన్న హీరోయిన్‌ కేవలం శ్రీలీల మాత్రమే అంటూ ఈ ఫోటోలతో నిరూపితం అయిందని అభిమాలను ఫీల్ అవుతున్నారు.

ఇటీవల ఈ అమ్మడు నితిన్ తో కలిసి ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. అయినా కూడా గుంటూరు కారం సినిమాపై నమ్మకం పెట్టుకుని శ్రీలీల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందంతో పాటు అభినయం తో కూడా మెప్పించగల సామర్థ్యం ఉన్న శ్రీలీల కచ్చితంగా మరింత బిజీ అవ్వబోతుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.