సినీ ఇండస్ట్రీని ఊపేస్తున్న డ్రగ్స్ దందా?

0

కర్ణాటకలో కొలువైన శాండల్ వుడ్ సినీ పరిశ్రమ గుట్టును ఓ మాయలేడి బయటపెట్టింది. గుట్టుచప్పుడు కాకుండా స్మగ్లర్ల నుంచి మత్తుపదార్థాలను కొనుగోలు చేస్తున్న శాండల్ వుడ్ కు చెందిన నటులు సంగీత కళాకారుల పేర్లను డ్రగ్స్ డీలర్ అనికా తాజాగా ఎన్.సీ.బీ అధికారులకు వెల్లడించడంతో కర్ణాటక సినీ ఇండస్ట్రీలో కలకలం చెలరేగింది.డ్రగ్స్ కు కోడ్ పేర్లను పెట్టి సరఫరా చేస్తున్నామని ఆమె తెలిపారు.

తన నుంచి ఏఏ నటీనటులు డ్రగ్స్ ను కొన్నది ఆమె పోలీసులకు తెలుపడంతో కలవరం మొదలైంది. సుమారు సినీ రంగానికి చెందిన 30మంది వ్యక్తుల పేర్లను అనికా పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి సాక్ష్యాధారాలను సేకరించిన ఎన్.సీ.బీ సినీ ప్రముఖులందరికీ నోటీసులు అందించాలని నిర్ణయించారు.

బెంగళూరులో అనికా మత్తు దందాను నడుపుతున్నట్లు పోలీసుల విచారణ తేలింది. సోషల్ మీడియా ద్వారా ఈ దందా చేస్తోంది. తమిళనాడు కు సేలం ఈమె సొంతూరు. హోటల్ మేనేజ్ మెంట్ చేసి బెంగళూరుకు వచ్చి ఉద్యోగం దొరక్క ఈ డ్రగ్స్ దందాలోకి దిగిందని తేలింది.

డ్రగ్స్ దందాలో దాదాపు సినీ రంగానికి చెందిన 15మందికి నోటీసులు ఇవ్వనున్నారు. దర్శకుడు ఇంద్రజిత్ ఈ మేరకు పోలీసులకు లొంగిపోయాడు. ఆ 15మంది సీనీ ప్రముఖులు ఎవరనేది శాండల్ వుడ్ ను ఊపేస్తోంది.