ఇంత అందంగా ఉంటే మోస్ట్ వాంటెడ్ కాకుండా ఎలా ఉంటుంది

0

2016వ సంవత్సరంలో వచ్చిన ఎంఎస్ ధోనీ సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ కియారా అద్వానీ. ఈ అమ్మడు ఒక వైపు సినిమాల్లో నటిస్తూ మరో వైపు వెబ్ సిరీస్ లు చేస్తూ నటిగా మంచి గుర్తింపు దక్కించుకోవడంతో పాటు తన అందంతో రెగ్యులర్ గా సోషల్ మీడియాలో కనువింధు చేస్తూనే ఉంది. తెలుగులో ఈమె నటించింది రెండే సినిమాలు అయినా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం బాలీవుడ్ కే ఈమె పూర్తి సమయం కేటాయిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం కియారా బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.

హీరోయిన్స్ ఇలాంటి హాట్ ఫొటో షూట్స్ పోస్ట్ చేయడం కామన్. అయితే కియారా పోస్ట్ చేసే ఫొటో షూట్ స్టిల్స్ చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఆమె అందాల ఆరబోతతో పాటు విభిన్నమైన కాన్సెప్ట్ తో ఉంటాయి. కనుక ఈ అమ్మడిని నెట్టింట చూడాలని చాలా మంది ఆశిస్తూ ఉంటారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ ను మిలియన్స్ ల్లో ఫాలో అవుతూ ఉంటారు. ఇక మింత్ర కోసం తీసుకున్న ఈ ఫొటో షూట్ లో కియారా లుక్ అదిరింది. ఇంత అందంగా ఉండటం వల్లే ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.