కొరటాల వెబ్ సిరీస్ హీరో విషయంలో క్లారిటీ

0

ఈమద్య కాలంలో ప్రముఖ ఫిల్మ్ మేకర్స్ వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపిస్తున్నారు. కొత్త వారిని ప్రతిభ ఉన్నవారికి ఎంకరేజ్ చేయడంతో పాటు మంచి కంటెంట్ ను ప్రేక్షకులకు అందించే ఉద్దేశ్యంతో కొరటాల శివ కూడా ఒక వెబ్ సిరీస్ ను నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. తన శిష్యుడితో వెబ్ సిరీస్ ను నిర్మించేందుకు కొరటాల ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఆ వెబ్ సిరీస్ లో నటీనటులు ఎవరు అనే విషయంలో మెల్ల మెల్లగా క్లారిటీ ఇస్తున్నారు.

ఈ వెబ్ సిరీస్ లో యువత చదువుకునే రోజుల్లో ప్రేమలో పడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుంది అనే విషయమై కొరటాల శివ సందేశాత్మకంగా తన వెబ్ సిరీస్ లో చూపించబోతున్నాడట. కాన్సెప్ట్ మరియు కథ కొరటాలదే అని దర్శకత్వం ఆయన శిష్యుడు చేస్తున్నట్లగా తెలుస్తోంది. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి నటించబోతున్నాడట. ట్యాలెంటెడ్ నటుడిగా పేరు దక్కించుకున్న నవీన్ ఈ వెబ్ సిరీస్ లో మంచి పాత్రలో కనిపించబోతున్నాడట. మిగిలిన పాత్రలకు త్వరలోనే నటీనటులను ప్రకటించి షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నారు. మరో వైపు ఆచార్య షూటింగ్ ను పునః ప్రారంభించడం కోసం కొరటాల వెయిట్ చేస్తున్నాడు. ఆచార్య పూర్తి అయిన వెంటనే అల్లు అర్జున్ తో ఒక సినిమాను కొరటాల చేయబోతున్న విషయం తెల్సిందే.