మోనాల్ తెలిసి చేస్తుందా? తెలియక చేస్తుందా?

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో మోనాల్ గజ్జర్ నడిపిస్తున్న ట్రై యాంగిల్ వ్యవహారం మొదట బాగుంది అనిపించినా ఇప్పుడు మాత్రం కాస్త కన్ఫ్యూజన్ గా ఉంది. మోనాల్ గేమ్ కోసమో లేదా మరేదో కారణంగా తనతో మరియు అభిజిత్ తో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది తప్ప అంతకు మించి ఏమీ లేదేమో అంటూ అఖిల్ భావించినట్లున్నాడు. అందుకే ఆయన కొన్ని రోజులుగా మోనాల్ తో సరిగా మాట్లాడటం లేదు. ఇప్పటికే చాలా సార్లు ఎందుకు నాతో సరిగా మాట్లాడటం లేదు అంటూ అఖిల్ ను మోనాల్ గుచ్చి గుచ్చి అడిగినా అతడి నుండి మాత్రం స్పందన అంతంత మాత్రంగానే ఉంది.

తాజాగా మరోసారి మోనాల్ పడుకుని ఉండగా అఖిల్ పక్కన కూర్చున్నాడు. ఆ సమయంలో అఖిల్ పట్ల ఇష్టం ప్రేమను మోనాల్ చూపించే ప్రయత్నం చేసింది. నువ్వు నా మెడిసిన్ అంటూ అతడి పట్ల అనురాగం కురిపించేందుకు చూసింది. కాని ఆ మెడిసిన్ కు డేట్ దాటి పోయింది అంటూ సున్నితంగా ఆమెను దూరం పెట్టే ప్రయత్నం చేశాడు. మోనాల్ విషయంలో అఖిల్ ఒక స్పష్టతకు రాలేక పోతున్నాడు. నిన్నటి ఎపిసోడ్ లో కూడా నాగార్జున తో మోనాల్ మాట్లాడుతూ తన విషయంలో ఇద్దరు తప్పు చేసి మళ్లీ ఇద్దరు క్షమాపణ చెప్పారు అంది. ఇద్దరి పట్ల తనకు అభిమానం ఇష్టం ఉంది అన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది.

అఖిల్ కు మాత్రం ఆమె విషయంలో అస్సలు స్పష్టత లేదు. అందుకే తాను ఆమెతో దూరంగా ఉంటున్నట్లుగా చెప్పకనే చెప్పాడు. ఒక వైపు అభిజిత్ మరో వైపు అఖిల్ తో ఆమె కనెక్షన్ కోరుకుంటుందా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకసారి అభిజిత్ ను ఇష్టం అంది. మరో సారి అఖిల్ ను ఇష్టం అంటూ చెప్పింది. ఇలా ఆమె డబుల్ గేమ్ ఆడుతుందా లేదా ఆమెకు తెలియకుండానే ఆమె ఇద్దరి పట్ల ఆకర్షితం అవుతుందా అనేది తెలియడం లేదు. మొత్తానికి ఈ ట్రయాంగిల్ నుండి అఖిల్ బయట పడేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులు ఏం జరుగుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.