సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చేనా…?

0

టాలీవుడ్ లో కామెడీ ఎంటర్టైనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. కమెర్షియల్ సినిమాలకి తనదైన కామెడీని జోడించి ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. ‘పటాస్’ సినిమాతో మెగాఫోన్ పట్టిన అనిల్ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించడంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత ‘సుప్రీమ్’ ‘రాజా ది గ్రేట్’ సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నాడు. అదే ఊపులో గతేడాది ‘F2 – ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. వంద శాతం సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి.. లాక్ డౌన్ టైంలో ‘F2’కి సీక్వెల్ ‘F3’ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాడు.

కాగా కరోనా కారణంగా ‘F2’ హీరోలు వెంకటేష్ – వరుణ్ తేజ్ లు ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ పూర్తి చేయలేకపోయారు. వెంకటేష్ ‘నారప్ప’ సినిమాతో.. వరుణ్ తేజ్ ఓ బాక్సింగ్ నేపథ్యంలో సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. దీంతో వెంటనే ‘F3’ స్టార్ట్ చేయాలనుకున్న అనిల్ కి హీరోలు డేట్స్ ఇచ్చే అవకాశం లేదు. ‘సరిలేరు నీకెవ్వరూ’ వంటి హిట్ కొట్టి ఫామ్ లో ఉన్న అనిల్.. ఇప్పుడు ‘F3’ కంటే ముందు మరో ప్రాజెక్ట్ చేయాలనే ఆలోచన చేస్తున్నాడట. ఈ క్రమంలో ఇప్పటికే రెడీగా ఉన్న ఓ కామెడీ స్క్రిప్ట్ ని పట్టాలెక్కించాలని చూస్తున్నాడట. ‘నాలుగు స్తంభాలాట’ అనే టైటిల్ తో రానున్న ఈ చిత్రానికి ‘F3’ ని నిర్మించాల్సిన దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారని ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు.

అయితే మరోవైపు అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణతో ఓ మూవీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ కూడా వస్తోంది. అయితే బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేస్తున్నాడు. పరిస్థితులు అనుకూలించిన వెంటనే జెట్ స్పీడ్ తో షూటింగ్ కంప్లీట్ చేస్తామని బాలయ్య ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాలయ్య కోసం అనిల్ వెయిట్ చేస్తాడేమో అనే డౌట్స్ కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి అనిల్ త్వరలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.