అక్కినేని నాగ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేయనున్న సమంత..!!

0

ప్రస్తుత కాలంలో సినీ తారలంతా ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ అంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు సినీ హీరోలు – హీరోయిన్లు అంతా కూడా ఏదొక మీడియా మాధ్యమంలో ఎప్పటికప్పుడు యాక్టీవ్ గా ఉంటుంటారు. వారి అభిమానులతో పంచుకోవాల్సిన విషయాలను పంచుకుంటారు. దాదాపుగా చిన్న హీరోల దగ్గర నుండి సీనియర్ హీరోల వరకు అందరూ ఫ్యాన్స్ తో కాంటాక్ట్ లో ఉంటున్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో అందరికి తెలిసిందే. ఏమున్నా వెంటనే ట్విట్టర్ వేదికగా పంచుకుంటారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో సినీ హీరోల పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఫాలోయర్స్ కామన్ డీపీ అనేది ఒకటి రిలీజ్ చేస్తున్నారు. దాదాపు పుట్టినరోజుకు పదిరోజులు ముందే ఈ హడావిడి అంతా మొదలు పెడుతున్నారు. అయితే ఈ నెల 29న అక్కినేని నాగార్జున పుట్టినరోజు జరుపుకోనున్నారు.

ఈ క్రమంలో అక్కినేని అభిమానులు నాగార్జున పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగార్జున కామన్ డీపీ కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ మధ్యకాలంలో కామన్ డీపీ అనేది చాలా కామన్ అయిపోయింది. తమ ఫేవరెట్ హీరో కామన్ డీపీ తోనే పుట్టినరోజు వేడుకలు ప్రారంభిస్తున్నారు అభిమానులు. అయితే నాగార్జున కామన్ డీపీని ఓ ప్రముఖ హీరోయిన్ చేత లాంచ్ చేయనున్నారు. ఆమె ఎవరో కాదు అక్కినేని కోడలు – స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా నాగ్ కామన్ డీపీ విడుదల చేయనున్నారు. ఆగస్టు 23న సాయంత్రం 6 గంటలకు నాగ్ కామన్ డీపీతో అడ్వాన్స్ బర్త్ డే సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేయనున్నారు. ఇక ట్విట్టర్ లో కూడా ఫ్యాన్స్ హ్యాష్ ట్యాగ్ లతో రికార్డులు బద్దలు కొడతామని అంటున్నారట. అయితే ఈసారి మామ డీపీని కోడలు విడుదల చేయడం కాస్త విశేషం అనే చెప్పాలి.