ఛార్మి డాగ్ ఎంత పెద్దదో

0

పెట్ డాగ్స్ తో ఆటలాడుకోవడం అంటే కొందరికి మహా అనురక్తి. కుక్క పిల్లి అంటే కొందరికి అలర్జీ ఉంటుందేమో కానీ చాలా మంది సెలబ్రిటీలకు ఇదో సరదా వ్యాపకం. పైగా పెట్స్ వల్లనే ఒత్తిళ్లను అధిగమించవచ్చనేది నిపుణులు చెప్పే మాట. బిజీ లైఫ్ ఒత్తిళ్ల నుంచి రిలాక్స్ అయ్యేందుకు పెట్స్ తో ఆటలాడుకోవడం ఎంతో ఇంపార్టెంట్.

అయితే ఇదిగో ఇక్కడ అందాల జ్యోతిలక్ష్మి అలియాస్ ఛార్మి కౌర్ ఏం చేస్తోందో చూశారుగా.. అసలే లాక్ డౌన్ పీరియడ్ .. ఆపై ఇలా పెంపుడు కుక్క తన చెంతకు వస్తుంటే దానిని హగ్ చేసుకుని నానా రచ్చ చేసేస్తోంది. ఎంతో ఇదిగో దాంతో కనెక్టయిపోయింది. ఈ క్షణం ఇలా జీవించడం ఎంతో అందమైనది! అంటూ అద్భుతమైన క్యాప్షన్ ని ఇచ్చింది ఛార్మి.

అయితే కుక్కలతో ఆటలాడుకోవడం బుజ్జగించడం ముద్దులాడుకోవడం తనకి ఇదే కొత్త కాదు. తనకు పెట్ డాగ్స్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఎప్పుడూ మూడు నాలుగు బ్రాండెడ్ కుక్క పిల్లల్ని పెంచుతుంది. వాటిని ముద్దులాడేస్తూ పలు వీడియోల్ని సోషల్ మీడియాల్లో రిలీజ్ చేసింది ఛార్మి.

ఇక పెట్స్ అంటే తన వ్యాపార భాగస్వామి అయిన పూరీ జగన్నాథ్ కి అంతే ఇష్టం. తన `కేవ్`లో ఇప్పటికే ఎన్నో రకాల పక్షుల్ని.. కుక్కల్ని పెంచుతున్నారు. అయితే ఛార్మి ఆ బ్రాండెడ్ బ్రీడ్ డాగ్ తో ఆటలాడుకుంటున్న ఫోటోని పూరి కనెక్ట్స్ (ఛార్మి సీఈవో) ట్విట్టర్ లో పోస్ట్ చేశారు కాబట్టి ఈ డాగ్ పూరి కేవ్ లోనే నివశిస్తోందన్నమాట. ఇంతకీ ఇది ఏ బ్రీడ్ డాగ్? అంటూ యూత్ ఒకటే డిస్కషన్ లో పడిపోయారు. సల్మాన్ ఖాన్ కంటే బలంగా ఎత్తుగా ఉంది అది. మరి అలాంటి డాగ్ ఓ పట్టుపడితే అంతేగా!!