టాలీవుడ్ సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ హీరోగా కొత్త సినిమా చేస్తున్నాడు. అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇటు పలు సినిమాలలో ప్రధాన పాత్రధారిగా ఆకట్టుకుంటున్న నటకిరీటి.. మరో ప్రయత్నానికే తెరలేపాడు. చాలాకాలం తర్వాత రాజేంద్రప్రసాద్ ఓ కాంట్రవర్సీ క్యారెక్టర్ పోషించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే క్లైమాక్స్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ పాత్ర ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాను పోలి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. క్లైమాక్స్ అనే టైటిల్ తోనే ఇంటరెస్ట్ క్రియేట్ చేశారు మేకర్స్. తాజాగా క్లైమాక్స్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఓ బిజినెస్ మ్యాన్ తన డబ్బు బలంతో లైఫ్ లో మూడు గోల్స్ పెట్టుకుంటాడు. అలాగే అతనికి అమ్మాయిల వీక్నెస్ కూడా పుష్కలంగా ట్రైలర్ లో చూపించారు. ఎప్పుడూ పార్టీలు క్లబ్బులు పబ్బులలో టైంపాస్ చేసే బిజినెస్ మ్యాన్ తనను పిచ్చోడు అనే స్వయంగా ప్రకటించడం ఆశ్చర్యకరం.
విజయ్ మోడీ అనే పాత్రలో రాజేంద్రప్రసాద్ కొత్తగా కనిపిస్తున్నాడు. ఇక ఆయనతో పాటు పృథ్వీరాజ్ శివశంకర మాస్టర్ శ్రీరెడ్డి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా శ్రీరెడ్డి ఇందులో స్పెషల్ పాత్రలో కనిపిస్తుండడంతో సినిమా పై బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఆమె పాత్రను చాలా గ్లామరస్ గా డిజైన్ చేసాడట డైరెక్టర్. ఇదివరకే తన లైఫ్ కు దగ్గరగా ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఉందని శ్రీరెడ్డి చెప్పింది. భవాని శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పి.రాజేశ్వర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే డ్రీమ్ సినిమా తర్వాత డైరెక్టర్ భవాని నుండి వస్తున్న సినిమా ఇది. రాజేంద్రప్రసాద్ కూడా ఈ సినిమా పై చాలా పాజిటివ్ గా ఉన్నట్లు ప్రకటించాడు. త్వరలోనే థియేటర్లలో విడుదల చేయనున్నారట. మరి ఈ తెలుగు మోడీ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలంటే మాత్రం కొంతకాలం వెయిట్ చేయకతప్పదు.