సింగర్ దీప్తిని వవాహమాడిన కమెడియన్ – రియాల్టీ షో ఫేం బాల్ రాజ్

0

కమెడియన్ రియాల్టీ షో ఖత్రోంకీ ఖిలాడీ 10 ఫేమ్ బాల్రాజ్ సియాల్ బాలీవుడ్ సింగర్ దీప్తి తులిని వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ జలంధర్లో ఆగస్ట్ 7వ తేదీనే పెళ్లి చేసుకున్నాడు. అయితే దాదాపు నెల రోజుల పాటు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన బాల్రాజ్ సియాల్ ఇప్పుడు తన సతీమణి దీప్తితో కలిసి ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. సోషల్ మీడియాలో ఈ జంటకు గ్రీటింగ్స్ వెల్లువెత్తుతున్నాయి.

బాల్రాజ్ సియాల్ కొద్దిరోజుల క్రితమే మిస్టరీ గర్ల్గా ఓ ఫోటో పోస్ట్ చేసి రొమాంటిక్ కాప్షన్ ఇచ్చాడు. ఈ మిస్టరీ గర్ల్ ఎవరబ్బా అని కొంతమంది అడిగారు. అప్పుడే ఏదో ఉంది అని చాలామంది భావించారు. కానీ తాజా పోస్టు ద్వారా బాల్రాజ్ తాను సింగర్ దీప్తి తులిని పెళ్లి చేసుకున్నట్లు స్పష్టం చేశాడు. తామిద్దరం జూలై 2019లో తొలిసారి చండీగడ్లో షూటింగ్ సమయంలో కలుసుకున్నామని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అతను హోస్టింగ్గా ఉన్న షోలో దీప్తి మ్యూజికల్ బ్యాండ్ ప్రదర్శన ఇచ్చింది.

ఆ తర్వాత దీప్తి పైన తాను ఇష్టాన్ని పెంచుకున్నానని అతను పలుమార్లు ఆమెకు సందేశాలు కూడా పంపించాడు. కానీ దీప్తి నుండి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఆమెకు తాను నచ్చలేదని బాల్రాజ్ భావించాడు. ఆ తర్వాత కేకేకే 10 షూటింగ్ సమయంలోను బాల్రాజ్ ఆమెకు సందేశాలు పంపించాడు. అప్పటికీ ఆమె నుండి స్పందన రాలేదు. ఆ తర్వాత టర్కీ గ్రీస్ పర్యటనలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. జనవరిలో పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. కానీ ఆమె నుండి మళ్లీ స్పందన కనిపించలేదు. మరో ప్రోగ్రాంలో పెళ్లి విషయం తీసుకు వచ్చాడు. అప్పుడు అంగీకరించింది.